Shivaji: వైరల్ అవుతున్న శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ఏమైందంటే?

Shivaji: సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాక్టర్ శివాజీ. ఒకనొక సమయంలో కీలక వేషాలు కూడా వేశారు. ఆ తర్వాత ఆఫర్లు తగ్గించిపోయాయి. ప్రస్తుతం రాజకీయ అనలిస్ట్ గా కొనసాగుతున్నారు. తాజాగా శివాజీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆయన చెప్పుకొచ్చారు.

మా అమ్మానాన్న కష్టాన్ని గుర్తు చేసిన కాలం గొప్పదని శివాజీ అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి చనిపోయారని ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి ఆ వ్యక్తి కొడుకు అయిన పెద్ద హీరోను హగ్ చేసుకోవాలని వెళ్లగా ఆ హీరో రెండు చేతులు పక్కకు తీశాడని తెలిపారు. ఇక్కడ హోదా ఉంటే మాత్రమే మనం వీళ్లను హగ్ చేసుకోగలమేమో అని అనిపించిందని చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తులను చూస్తున్న సమయంలో ఎవరైనా చనిపోతారని ఎందుకు ఇవన్నీ అని అనిపించిందని శివాజీ తెలిపారు.

 

మరో పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడని అతనికి గుర్తు రావాలని ఈ విషయం చెబుతున్నానని శివాజీ అన్నారు.ఒక పెద్ద ఆర్టిస్ట్ నన్ను కలిసి రెమ్యునరేషన్ అడగ్గా నా రెమ్యునరేషన్ చెప్పానని శివాజీ తెలిపారు. ఆ పెద్ద ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి నాకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారట కదా అని కామెంట్ చేయగా ఆ ప్రొడ్యూసర్ ఫుల్ రెమ్యునరేషన్ ఇవ్వలేదని శివాజీ చెప్పుకొచ్చారు.

 

ఇక ఇండస్ట్రీ పెద్ద, మెగాస్టార్ చిరంజీవికి తాను వీరాభిమానినని శివారు చెప్పారు. అంతేకాకుండా తనని ఎంతో బాగా చూసుకున్నారని అన్నారు. ఇప్పటి హీరోలు చాలా స్మార్ట్ అని ఎవర్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారని శివాజీ పేర్కొన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు నాకు ఒక వ్యక్తి గ్యాప్ క్రియేట్ చేశాడని అనుమానం వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిలకు డిపాజిట్ రాదట.. బాధగా ఉందట.. జగన్ మొసలి కన్నీరు వెనుక లెక్కలివేనా?

CM Jagan: రాజకీయాలు కుటుంబ సభ్యులను సైతం బద్ధ శత్రువులుగా మారుస్తుందని విషయం మరొకసారి రుజువయింది. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయి బహిరంగంగానే ఒకరిని ఒకరు...
- Advertisement -
- Advertisement -