Sharwanand: మెగా నిర్మాతకు నో చెబుతున్న శర్వానంద్.. నో చెప్పడం వెనుక అసలు కథ ఇదేనా?

Sharwanand: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఒక నిర్మాతతో సినిమా చేసి ఆ సినిమా మంచి సక్సెస్ అయితే కనుక వెంటనే ఆ ప్రొడక్షన్లో మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతారు అలా కాకుండా సినిమా ఫెయిల్యూర్ అయితే మాత్రం ఆ నిర్మాతతో సినిమాలు చేయటానికి అసలు ఆసక్తి చూపించరు. సినిమా ఫ్లాప్ అయ్యి నిర్మాతలకు నష్టాలు కనక వస్తే మరొక సినిమా డేట్స్ ఇస్తామని అప్పటికప్పుడు వారిని ఓదారుస్తూ మాటలు చెబుతారు కానీ వారికి డేట్స్ ఇవ్వడానికి మాత్రం ఇష్టపడరు.

తాజాగా నిర్మాత అనిల్ సుంకరకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. సామజ వరగమన సినిమా ద్వారా ఎంతో మంచి హిట్ అందుకున్నారు డైరెక్టర్ రామ్ అబ్బ రాజు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన తన తదుపరి సినిమాని కూడా అనిల్ సుంకర నిర్మాణంలోనే చేయాల్సి ఉంది. కానీ నిర్మాత ఏషియన్ సునీల్ తాను ఒక సినిమా చేస్తానని చెప్పడంతో అనిల్ సుంకర కూడా ఓకే అన్నారు అయితే ఈ నిర్మాత సునీల్ ఈ సినిమా కథతో డైరెక్టర్ ను నాగచైతన్య వద్దకు పంపించగా నాగచైతన్య సెకండ్ హాఫ్ తనకెందుకో నచ్చకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.

ఇక ఈ సినిమాకు శర్వానంద్ ఫైనల్ అయ్యారు అయితే నిర్మాత సునీల్ మాత్రం కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ కథతో మైత్రి వారి దగ్గరకు వెళ్ళగా ఈ సినిమా కథ తాను చేయాల్సి ఉందని అనిల్ సుంకర అడ్డుపడ్డారు. అయితే అనిల్ సుంకరతో సినిమా చేయడానికి శర్వానంద్ మాత్రం ఒప్పుకోవడం లేదు అందుకు కారణం లేకపోలేదు. శర్వానంద్ గతంలో అనిల్ సుంకర దర్శకత్వంలో మహాసముద్రం సినిమా చేశారు.

అజయ్ భూపతి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కిన మహాసముద్రం సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అప్పట్లో అనిల్ సుంకరకు తదుపరి సినిమాలో డేట్స్ ఇస్తానని శర్వానంద్ చెప్పారు. అయితే ఇప్పుడు కనుక అనిల్ సుంకరకు డేట్స్ ఇస్తే తను రెమ్యూనరేషన్ లేకుండా అయిన నటించాలి లేదా అత్యంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని అయినా నటించాల్సి ఉంటుంది. అందుకే అనిల్ సుంకరతో సినిమా చేయడానికి శర్వానంద్ ఏమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -