Sharwanand: చరణ్ పాపకు శర్వానంద్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Sharwanand: టాలీవుడ్ లో ఒకలాంటి పండగ వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. ఈ సంబరాలు ఎందుకంటే మెగా కాంపౌండ్ లోకి వచ్చిన కొత్త మెంబర్ మెగా ప్రిన్సెస్ గురించే. అవునండి ఇంకా పేరు పెట్టకపోయినా మెగా ప్రిన్సెస్ హాష్ టాగ్ తో ట్రెండింగ్ సృష్టిస్తుంది మెగాస్టార్ చిరంజీవి మనవరాలు.

 

అవునండి ఎవరైనా పుట్టిన తర్వాత వారు చేసే పనిని బట్టి సెన్సేషన్ అవుతారు కానీ కడుపులో పడిన దగ్గర్నుంచి ట్రెండింగ్ సునామీ సృష్టిస్తుంది మెగా ప్రిన్సెస్. చిరంజీవి ఆనందానికైతే హద్దులు లేవు. మా ఇంటి మహాలక్ష్మి మా ఇంట్లో కనిపించే పాజిటివ్ వైబ్స్ కి కారణం తనే అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

ఇక టాలీవుడ్ మొత్తం రాంచరణ్ కూతుర్ని చూసి సంతోషిస్తున్నారు. ఎవరికి తోచిన గిఫ్ట్ లు వాళ్లు ఇస్తున్నారు. రామ్ చరణ్ చిరకాల మిత్రుడు అత్యంత సన్నిహితుడు అయినా శర్వానంద్ అయితే రామ్ చరణ్ కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడంట. గిఫ్ట్ ఏంటో తెలుసుకొని షాక్ అయినా నెటిజన్స్ మెగా వారసుల కన్నా శర్వానందే నయం. వాళ్లు ఇప్పటికీ వచ్చి చిన్న బొమ్మ కూడా పాప కోసం గిఫ్ట్ చేయలేదని సమాచారం.

 

ఇంతకీ శర్వానంద్ పాప కోసం ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా.. ఒక సంవత్సరానికి సరిపడా బేబీ ప్రొడక్ట్స్. బట్టల దగ్గర నుంచి అదీ ఇదీ అని కాకుండా పుట్టిన పాపకి అవసరమైన ప్రతి వస్తువు ఆ గిఫ్ట్ లో ఉందంట. భలే ఉంది కదా గిఫ్ట్.. అవును మరి చరణ్, శర్వానందుల స్నేహం అలాంటిది వాళ్లు ఓకే స్కూల్లో చదువుకున్నారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే.

 

చిరు అయితే శర్వానంద్ గురించి మాట్లాడుతూ ఇతను లైఫ్ లో యాక్టర్ అవుతాడని నేను అనుకోలేదు అంత కామ్ గా, మెచ్యూర్డ్ గా ఉండేవాడు. అలాంటిది తను యాక్టర్ అవుతాను అన్నప్పుడు తాను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఏదైనా రిలేషన్ కన్నా ఫ్రెండ్షిప్ గొప్పదని నిరూపించాడు శర్వానంద్.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -