TDP: రాయలసీమలో టీడీపీ చరిత్ర ముగిసిందా.. అన్ని సీట్లే వస్తాయా?

TDP: ప్రస్తుతం రాయలసీమలో ఒక ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది. అదేమిటంటే చంద్రబాబు నాయుడుని నమ్మని రాయలసీమ కొడుకు నారా లోకేష్ ను నమ్ముతుందా అన్న ప్రశ్న ఎక్కువగా ఉత్పన్నమవుతోంది. రాయ‌ల‌సీమ‌లో త‌న తండ్రి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పంలో నారా లోకేశ్ పాద‌యాత్ర మొద‌లు పెట్టారు. దాదాపుగా 125 రోజుల పాటు రాయ‌ల‌సీమ‌లో లోకేశ్ పాదయాత్రను కొనసాగించారు. అనంత‌రం నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో ప్ర‌వేశించారు. రాయ‌ల‌సీమను దాటుకుని నెల్లూరులో అడుగు పెడుతూ క‌రవు నేల‌ను ముద్దాడుతూ ఫొటోల‌కు పోజులిచ్చారు లోకేష్.

 

అయితే రాయ‌ల‌సీమ స‌మాజాన్ని ఉద్దేశించి లోకేశ్ ప‌దేప‌దే అన్న మాట‌ ఈ ప్రాంతం వైఎస్ జ‌గ‌న్‌కి 49 సీట్లు ఇచ్చిందని, అయినా ఏం అభివృద్ధి జ‌రిగింద‌ని ప్ర‌శ్నించారు. కాగా రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీకి జ‌గ‌న్‌కు ఇచ్చిన‌న్ని సీట్లు ఇస్తే, సీమ స‌త్తా ఏంటో దేశానికి చూపిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికారు. అలాగే మిష‌న్ రాయ‌ల‌సీమ పేరుతో ప్ర‌ణాళిక విడుద‌ల చేసి, ప్ర‌జాద‌ర‌ణ పొందేందుకు ప్ర‌య‌త్నించారు. ఆ విధంగా లోకేశ్ మాట‌లు న్నాయ‌ని సెటైర్స్ వేస్తున్నారు. అస‌లు రాయ‌ల‌సీమ‌లో టీడీపీని ఎందుకు ఆద‌రించ‌లేదో లోకేశ్ ఆత్మావ‌లోక‌నం చేసుకోవాలి. సీమ వ్య‌తిరేక పార్టీగా టీడీపీ న‌డుచుకుంటోంద‌నేది ప‌చ్చి నిజం. రాయ‌ల‌సీమ క‌రవు పీడిత ప్రాంతం. అంతేకాదు, టీడీపీ పీడిత ప్రాంతంగా పేరు తెచ్చుకుంద‌నే చేదు నిజాన్ని లోకేశ్ గ్ర‌హించాలి.

రాయ‌ల‌సీమ‌లో పుట్టి, అక్క‌డి నుంచే ప్రాతినిథ్యం వ‌హిస్తూ కూడా త‌న తండ్రి క‌రవును పోగొట్టేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేద‌న్న వాస్త‌వాన్ని గ్ర‌హించాలి. నీ పక్కన పెట్టి ఎంతసేపు జ‌గ‌న్‌కు 49 సీట్లు ఇచ్చార‌ని, త‌మ‌కెందుకు ఇవ్వ‌ర‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఎందుకు ఆద‌రిస్తున్నారో అర్థం చేసుకోవాలి. రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శ్యామలం చేసేందుకు కృష్ణా నీటిని తీసుకొచ్చేందుకు దివంగ‌త వైఎస్సార్ త‌న హ‌యాంలో భ‌గీర‌థ ప్ర‌య‌త్నం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్ సామ‌ర్థ్యాన్ని పెంచి, త‌ద్వారా కృష్ణా నీటిని రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించేందుకు ఇటు స్వ‌ప‌క్షం, అటు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో ఫైట్ చేశారు. అందుకే వైసిపిని జనాలు ఆదరిస్తున్నారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా మిష‌న్ రాయ‌ల‌సీమ అంటూ ఏవో హామీలిస్తే న‌మ్మేంత అజ్ఞానంలో సీమ స‌మాజం లేదు. ఎందుకంటే న‌మ్మ‌కం అనే ప‌దానికే అర్థం లేకుండా త‌న తండ్రి చంద్ర‌బాబు సీమ విష‌యంలో చేశార‌ని లోకేశ్ అర్థం చేసుకోవాలి. చంద్ర‌బాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్న‌ప్పుడు తాను పుట్టి పెరిగిన‌, ఎమ్మెల్యే గా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప్రాంతానికి ఏం చేశారో చెబితే, నేడు ఆద‌రించాల‌ని దేబ‌రించాల్సిన అవ‌స‌రం టీడీపీకి వ‌చ్చి ఉండేది కాదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -