CI Swarnalatha: సీఐ స్వర్ణలత దారి తప్పడం వెనుక ఆ పిచ్చే కారణమా?

CI Swarnalatha: సినిమా పిచ్చితో ఉన్నతమైన భవిష్యత్తుని నాశనం చేసుకుని దారి తప్పిన ఒక ఉన్నత స్థాయి పోలీస్ ఆఫీసర్ స్వర్ణలత. దీనికి ఉన్న సినిమా పిచ్చి ఈమెని అవినీతికి పాల్పడేలాగా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి డబ్బుని గుంజి అడ్డంగా దొరికిపోయింది సీఐ స్వర్ణలత. ప్రవృత్తి పరంగా వెండితెరపై మక్కువ ఏర్పరుచుకుని అవకాశాల కోసం అధికార పార్టీ నేతలతో సైతం సాహిత్యం పెంచుకున్నారు.

ఏపీ 31 అనే సినిమాలో నటిస్తున్నారు విశాఖకు చెందిన మహిళా రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత. ఈ సినిమా నిర్మాణ వ్యవహారాల పర్యవేక్షణలోనూ స్వర్ణలత భాగస్వామి అయినట్లు సమాచారం అందుకు అవసరమైన డబ్బు కోసమే నోట్ల మార్పిడిలో కీలకంగా వ్యవహరించారా అందరికీ సినిమా పిచ్చే కారణమా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు రియల్టర్లతోనూ బడబడా పొలిటిషియన్స్ తో కూడా ఈమెకి పరిచయాలు ఉన్నాయి. రియల్ టర్ల నుంచి వచ్చిన కమిషన్ తీసుకున్న స్వర్ణలత నోట్ల మార్పిడి చేసుకోవాలని చూసేవారికి కొన్ని ప్లాట్లు కూడా బుక్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

 

సినిమా పిచ్చి ఉన్న ఈమెకు తాను తీసే సినిమాలో మంచి పాత్ర ఇస్తానని అందుకు నృత్యంలో ప్రావీణ్యం ఉండాలని ఒక ప్రజాప్రతినిధి చెప్పటంతో కొరియోగ్రాఫర్ని నియమించుకొని సాధన చేస్తున్నారు. అందులో భాగంగానే పలు వీడియోలు కూడా తీశారు. అయితే ఇప్పుడు నోట్ల మార్పిడి విషయంలో అడ్డంగా దొరికిపోవడం వలన ఈ బడా నాయకులందరూ కేసు లేకుండా మాఫీ చేద్దామని ప్రయత్నించారు.

 

కానీ పరిస్థితి చేదాటి పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేయవలసి వచ్చింది. తద్వారా ఈమె వ్యవహారం అంతా బట్టబయలు అయింది. హోంగార్డుల నిర్వహణ విషయంలో కూడా స్వర్ణలత అనేక ఆరోపణలు ఎదుర్కోవటం గమనార్హం. ఈమెకి వృత్తిపరంగా కూడా చాలా ఆరోపణలు ఎదుర్కొన్న చరిత్ర ఉంది. సినిమా పిచ్చితో ఇలా దారి తప్పటం అంత పెద్ద ఉన్నత ఉద్యోగికి సభ్యత కాదని అంటున్నారు జనాలు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -