Chiranjeevi: చిరంజీవి మెగాస్టార్ కావడానికి ఆ అవమానమే కారణమా?

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారు మోగిపోతోంది. అంతేకాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో మెగాస్టార్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఆ సంగతి పక్కన పెడితే చిరంజీవి మెగాస్టార్ కావడానికి ఒక బలమైన కారణం ఉందట. ఒక అవమానం చిరంజీవిని మెగాస్టార్ ను చేసిందట. ఇంతకీ ఆ అవమానం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ కి ఒకసారి ఏదో అనుభవం ఎదురయిందట. అదేమిటంటే.. నట శిక్షణలో ఉన్న సమయంలో పూర్ణా పిక్చర్స్‌ సంస్థ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి చిరంజీవి, హరిప్రసాద్‌, సుధాకర్‌ రివ్యూలు ఇస్తుండేవారు. అలా ఒక సినిమా చూసేందుకు వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చొన్నారు. ఇంతలో ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తికి చెందిన డ్రైవర్‌, మేకప్‌మ్యాన్‌లు ఆ ముగ్గురిని లేపారు. చేసేదేమీలేక వారు నిల్చొనే సినిమాను చూశారట. సినిమా ఎలా ఉంది? అని ఆ సంస్థ అధినేత భార్య అడగ్గా..ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాము. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్‌ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాము.

 

చూడండి ఆంటీ.. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి అని చిరంజీవి ఆవేశంలో చేసిన ఆ ఛాలెంజ్ ను నెగ్గారు. ఈ నంబర్లపై చిత్ర వర్గాల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇండస్ట్రీకి నంబర్‌ 1 హీరో చిరంజీవి గారే అని మహేశ్‌బాబు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాజిక సేవలోనూ చిరంజీవిది ప్రత్యేక ముద్ర. ఛారిటబుల్‌ ట్రస్టు, బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ స్థాపించారు. రాజకీయాల్లోకీ వెళ్లొచ్చారు. నిర్మాతగానూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి తనవంతు కృషి చేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ...
- Advertisement -
- Advertisement -