JanaSena Party: జనసేన పార్టీ నాశనం కావడానికి ఆ ఒక్కడే కారణమా?

JanaSena Party: నాదెండ్ల మనోహర్.. జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు. ఆ పార్టీలో నెంబర్ 2 గా వినిపిస్తున్న నేమ్ కూడా ఇదే. పవన్ కళ్యాణ్ కూడా మనోహర్ మాటనే వింటారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయనకు కాస్తంత ప్రాధాన్యం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ జనసేనలోని ఓ వర్గం ఆయన్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

 

పదేళ్ల క్రితం జనసేన పార్టీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పని చేస్తున్నారు. ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పవన్ తర్వాత బాధ్యతలన్నీ నాదెండ్లనే చూసుకుంటున్నారని వినికిడి. పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయనకు ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గలేదు. కానీ ఈ మధ్యనే
ఆయనకే సోషల్ మీడియాలో నెగిటివిటీ ప్రచారం అవుతోంది.

 

నాదెండ్ల మనోహర్ చుట్టూ ఎంత రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాదెండ్ల మనోహర్ కు వ్యతిరేకంగా ఓ వర్గం, అనుకూలంగా మరో వర్గం విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారాలు, ఆరోపణలు చేసకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. మనోహర్ పై ఎవరైనా ఏదైనా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ అవుతారని హెచ్చరించారు.

 

జనసేన పార్టీలోని చోటా నేతలు తమ ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయనపై అలుగుతున్నారు. ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వడం తమను పట్టించుకోకపోవడం వల్ల ఆయన కోవర్టు అంటూ ప్రచారం చేస్తున్నారు. కొంత కాలంగా ఇది మరీ ఎక్కువ అయింది. సొంత పార్టీ సోషల్ మీడియా సైనికులు కూడా ఇలాగే చేస్తూండటంతో వివాదం ముదిరింది.

 

మరోవైపు నాగబాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన నియామకం తర్వాత నాదెండ్ల ప్రాధాన్యత కాస్త తగ్గింది. అదే సమయంలో నాగబాబు కూడా తమ పార్టీలో కోవర్టలున్నారన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓ సారి తమ వేలే మన కన్ను పొడుస్తుందని పోస్టు పెట్టారు. ఇంకోసారి ఇన్ స్టా లో నమ్మిన వ్యక్తులు మోసం చేస్తే హింసే మార్గమని హెచ్చరికలు చేస్తూ పోస్టులు పెట్టారు. వీటన్నిటినీ చూస్తే జనసేనలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -