Veera Simha Reddy: వీరసింహారెడ్డి బ్రేక్ ఈవెన్ కు సమస్య అదేనా?

Veera Simha Reddy: సంక్రాంతి పండగ సందర్భంగా వీరసింహారెడ్డి సినిమా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంటోంది. అయితే సెకండాఫ్ లో ఈ సినిమాపై కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. సెకండాఫ్ నిడివి ఎక్కువగా ఉండటంతో కొంతమంది ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతున్నారు. అయితే బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా ఎంతగానో నచ్చింది. ఈ సినిమా తుది ఫలితం ఎలా ఉండబోతుందనే చర్చ ఇంకా సాగుతూనే ఉంది. వాల్తేరు వీరయ్య, వారసుడు సినిమాల ఫలితాలు వీరసింహారెడ్డి ఫైనల్ రిజల్ట్ ను తేల్చనున్నాయి. ఇకపోతే బాలయ్య మాత్రం ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు తన నటనతో పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారనే అనిపిస్తోంది.

 

వీరసింహారెడ్డి పాత్రలో బాలయ్య యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని అందరూ అంటున్నారు. అయితే సినిమాలో ఓ పాత్రను చంపకుండా ఉండి ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వరలక్ష్మి బాలయ్య కాంబో సీన్లను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో గోపీచంద్ మలినేని తడబడ్డారని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ ను నమ్మి ఛాన్స్ ఇవ్వకుండా కథ, కథనంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో బాలయ్య ఈ జాగ్రత్తలు తీసుకుంటే మరిన్ని అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు చెబుతున్నారు. స్క్రీన్ ప్లే, నిడివి విషయంలో గోపీచంద్ మలినేని కేర్ తీసుకుని ఉంటే బాగుండేదని, సెకండాఫ్ లో సాంగ్స్ ప్లేస్ మెంట్ కూడా బాలేదని ఇంకొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి మిక్స్డ్ టాక్ విషయంలో గోపీచంద్ మలినేని ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

 

బాలయ్య నటించిన పలు సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా రికార్డులు క్రియేట్ చేయగా ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుందేమోననేది ఇంకొన్ని రోజుల్లో తేలనుంది. స్టూడెంట్స్ కు సంక్రాంతి సెలవులు మొదలుకావడంతో ఆదివారం వరకు వీరసింహారెడ్డి కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని నెట్టింట కామెంట్లు జోరుగా వినపడుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -