Tarun: హీరో తరుణ్ సినిమాలకు దూరం అవడానికి తల్లే కారణమా.. అసలు విషయం ఏంటంటే?

Tarun:  తరుణ్ తెలుగు చలనచిత్ర నటుడు. ఈయన తమిళ, మలయాళ చిత్రాలలో కూడా నటించాడు. తరుణ్ డైరెక్టర్ సుశాంత్ చక్రపాణి కుమారుడు. తరుణ్ 1990లో మనసు మమత చిత్రం ద్వారా బాల నటుడుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. 1991 లో మణిరత్నం దర్శకత్వం వహించిన అంజలి చిత్రంలో బాల నటుడుగా నటించి ఉత్తమ బాల నటుడుగా జాతీయ చలనచిత్ర అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఇక రెండు మూడు సినిమాలు బాల నటుడుగా చేసి ఆ తర్వాత 2000 సంవత్సరంలో నువ్వే కావాలి చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం ఆ సంవత్సరం ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, శశిరేఖ పరిణయం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు.

విమర్శకుల నుండి ప్రశంసలు పొంది తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన హీరోలలో తాను కూడా చేరిపోయాడు. ఆ తర్వాత సడన్ గా తరుణ్ కు సినిమా అవకాశాలు తగ్గాయి. దీనికి సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ తరుణ్ చేసే ప్రతి సినిమాలో తల్లి జోక్యం ఉంటుంది అని వార్తలు వినిపించాయి. తల్లి తీసుకునే నిర్ణయాల వల్లే తరుణ్ కెరీర్ నాశనం అయిందనే వార్తలు గట్టిగానే వినిపించాయి.

అయితే ఓ ఇంటర్వ్యూలో తరుణ్ మాట్లాడుతూ.. ఈ ప్రచారం గురించి క్లారిటీ ఇచ్చాడు. అమ్మతో సినిమాల గురించి చర్చిస్తానని, కానీ సినిమా ఎంపిక విషయంలో అమ్మ జోక్యం చేసుకోదని తుది నిర్ణయం తానే తీసుకుంటారని తెలుపడం జరిగింది. తాను చేసిన సినిమాలలో బాగా ఇష్టపడి చేసిన సినిమా నువ్వే నువ్వే అని తెలిపాడు. ఇండస్ట్రీలో రూమర్లు సాధారణం అని ఇక తాను రియల్ లైఫ్ లో ఎప్పుడూ ప్రేమలో పడలేదని చెప్పాడు. ఇక తాను యాక్టింగ్ వైపు రాకుండా ఉన్నట్లయితే క్రికెట్లో మంచి లెవెల్ లో ఉండే వాడినని తెలిపాడు. జిమ్ అంటే తనకు నచ్చదని చెప్పడం జరిగింది. ఇక ఈయన సినిమాలకు కాస్త దూరంగా ఉండి పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -