Actor Tarun: మహేష్ – త్రివిక్రమ్ సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన తరుణ్?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హీరో తరుణ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇతడు బాల నటుడుగా తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు. అనంతరం అంజలి సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్.. ఆ పై పలు సినిమాలో నటించి నటుడుగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక తరుణ్ 20కి పైగా సినిమాల్లో నటించినప్పటికీ.. ఇండస్ట్రీలో చాలాకాలంగా కనిపించడం లేదు. 2018 లో ఇది నా లవ్ స్టోరీ సినిమా తర్వాత తరుణ్ పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. మరి సినిమాలకు ఎందుకు దూరమయ్యాడో తెలియదు కానీ.. తరుణ్ సినిమాలు మాత్రం ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా తరుణ్ గురించి ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

అదేమిటంటే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న SSMB28 అనే సినిమా మనందరికీ తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ప్రేక్షకులలో భారీ అంచనాలు మొదలయ్యాయి.

ఇక ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్ ని తీసుకుంటున్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ వార్తలు గురించి తరుణ్ ఈ విధంగా స్పందించాడు. తనను ఈ సినిమా కోసం ఎవరు ఆఫర్ చేయలేదని తెలిపాడు. అంతేకాకుండా ఈ వార్త నిజం కాదని చెప్పుకొచ్చాడు. తనకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ అయినా తన అభిమానులకు పంచుకుంటానని కానీ తనకు ఈ సినిమాలో అవకాశం రాలేదు అని స్పష్టం చేశాడు. ఇక ఈ రూమర్ ఎలా మొదలైందో కానీ చిలికి చిలికి గాలి వానగా మారింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -