SSMB28: త్రివిక్రమ్ తో సినిమాపై తరుణ్ క్లారిటీ.. ఏం అన్నారంటే?

SSMB28: 90s ఎవర్ గ్రీన్ హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో మంచి మెలోడీ సినిమాలు చేసి లవర్ బాయ్ గా మారాడు. తను చేసిన అన్ని సినిమా లు పెద్ద హిట్ అయ్యాయి. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఎక్కువ రోజులు తెలుగు పరిశ్రమ లో తరుణ్ సమయం గడపలేదు.

పైగా వరుస గా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత నుంచి తెలుగు సినీ పరిశ్రమలో నుంచి ఇతడు కనుమరుగైపోయాడు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా SSMB28. ఈ సినిమా లో తరుణ్ కు ఒక కీలకమైన పాత్రను త్రివిక్రమ్ తరుణ్ కు ఇచ్చాడని పుకార్లు వచ్చాయి.

అయితే దీని పై స్పందిస్తూ.. తనకు ఆ సినిమా బృందం నుంచి ఏటువంటి సమాచారం రాలేదని తరుణ్ పేర్కొన్నాడు. అతనికి ఆ సినిమా లో ఎటువంటి అవకాశం రాలేదని తెలిపాడు. ఇప్పటి వరకు తనకు ఏ సినిమాలో అవకాశం రాలేదని చెప్పాడు. తాను కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పాడు. వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తను కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడని, మంచి కథ దొరికితే కచ్చితంగా నటిస్తా అని ఆయన చెప్పాడు.

ఇప్పటికీ తను నటించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు. అలాగే సినిమాలలో ఎలాంటి అవకాశం వచ్చిన నా అభిమానులతో కచ్చితంగా పంచుకుంటాను అని ఆయన అన్నారు. అయితే తరుణ్ సినిమాల్లో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి పూర్తి విధాలుగా సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. అయితే సినిమాల్లో కి మళ్ళీ అడుగుపెట్టే అవకాశం వస్తె తరుణ్ తన నటనతో ఇంకోసారి ప్రేక్షకులను మెప్పించగలుగుతాడో లేదో చూడాలి. ఆయన ఫ్యాన్స్ కూడా మళ్లీ ఈయన సినిమాల్లోకి రావాలి అని కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -