Krishna Priya: తారకరత్నకు అట్లీ భార్యకు మధ్య ఉన్న లింక్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఏం జరిగిందంటే?

Krishna Priya:  ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో తమిళ దర్శకుడు అట్లీ పేరు కూడా ఒకటి. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సినిమా ఇటీవల విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపిస్తున్న విషయం తెలిసిందే. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించింది. కాగా డైరెక్టర్ అట్లీ విషయానికి వస్తే.. మొదట రాజా రాణి సినిమాతో డైరెక్టర్ గా కెరియర్ ను ఆరంభించిన ఈయన తేరి, బిజిల్, మెర్సల్ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు.

అయితే ఆయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో అపజయం ఎరుగని డైరెక్టర్గా దూసుకుపోతున్నారు అట్లీ. తర్వాత ఆయనకీ ఏకంగా షారుఖ్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. వచ్చిన ఆ అద్భుతమైన అవకాశంని ఉపయోగించుకుంటూ, షారుఖ్ ఖాన్ ని కనీవినీ ఎరుగని రేంజ్ లో మాస్ యాంగిల్ లో చూపించాడు. ఫలితంగా ఆ చిత్రం నేడు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కొల్లగొట్టబోతోంది. ఇకపోతే అట్లీ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇతను కృష్ణ కుమారి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

కృష్ణ కుమారి తెలుగు తమిళం భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే పలు సినిమాల్లో హీరోలకు చెల్లెలుగా కూడా నటించింది. అలా ఆరోజుల్లో ఈమె నందమూరి తారకరత్నతో కలిసి యువ రత్న అనే చిత్రం కూడా చేసింది. ఈ సినిమా ఆరోజుల్లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినప్పటికీ, కృష్ణ కుమారికి మాత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇందులో ఆమె తారకరత్నకి చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఈమె తారకరత్నకి అప్పట్లో మంచి స్నేహితురాలట. తారకారత్న బ్రతికి ఉన్నన్ని రోజులు అతనితో బాగానే మాట్లాడడంతో పాటు ఆయన చనిపోయినప్పుడు కృష్ణ కుమారి చాలా బాధపడింది అట. ఆమెకి సినిమాల్లో అవకాశాలు రప్పించడానికి అప్పట్లో తారకరత్న చాలా ప్రోత్సహించాడట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -