YCP: సీమలో కూడా వైసీపీకి భారీ షాకులు తప్పవా.. ఏం జరిగిందంటే?

YCP: వైఎస్ షర్మిల ఒక్కో అడుగు చూస్తుంటే.. జగన్ కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. జగన్ మూడు రాజధానులు పేరుతో 3 ప్రాంతాల్లో లాభపడాలని చూశారు. కానీ, అమరావతిని తుంగలో తొక్కడంతో అక్కడ ఎలాగూ రాజకీయంగా నష్టం తప్పదు. ఇక, వైజాగే ఏపీ రాజధానిగా మొన్నటి వరకూ ప్రచారం చేశారు. ఇదుగో వైజాగ్ కు తరలిస్తాం. అదుగో వైజాగ్ కు వచ్చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ, విశాఖకు తరలింపు కూడా అతీగతి లేకుండా పోయింది. దీంతో, ఉత్తరాంధ్రలో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఇక మిగిలిందే రాయలసీమే.

 

రాయలసీమలో జగన్ కు కూడా వీలైనంత మేర నష్టం చేయాలని షర్మిల కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీలోని కీలకమైన నేతలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన రోజునే హస్తం గూటికి చేరిన మంగళ గిరి ఎమ్మెల్యే ఇప్పటికే రాయలసీమ వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. రాయలసీమ నేతలు జగన్ దగ్గర ఇమడలేక బయటక రాలేక ఇన్నాళ్లు ఉక్కపోతకు గురైయ్యారు. టీడీపీలోనో, జనసేనలోనో చేరాలంటే.. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడంతో ఆశావహులందరికీ టికెట్ దక్కే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీల్లో చేరడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. బీజేపీలో చేరదామంటే.. ఏపీలో ఆ పార్టీకి భవిష్యత్ లేదు. ఆ పార్టీ నేతలకు భవిష్యత్ ఉండదు. కాబట్టి వైసీపీలోని ఆశావహులకు కనిపిస్తున్న ఒకేఒక్క ఆప్షన్ కాంగ్రెస్. పైగా షర్మిల వచ్చిన తర్వాత ఆ పార్టీకి కాస్త ఊపు వచ్చింది. గట్టిగా పని చేస్తే ఈ ఎన్నికల్లో కాకపోయినా వచ్చే ఎన్నికల్లోనైనా కింగ్ మేకర్ అవ్వొచ్చు అనే భావనలో రాయలసీమ నేతలు ఉన్నారు. పైగా, మిగిలిన పార్టీల్లా కాకుండా కాంగ్రెస్‌లో నేతల అభిప్రాయాలకు విలువ ఉంటుందనే భావన ఉంది. దీంతో, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

ఇప్పటికే గుమ్మనూరు జయరాం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారట. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ ఆదేశించింది. కానీ, ఆయన గుమ్మునంగా ఉన్నారు. పార్టీ ఆదేశించిన తర్వాత కూడా ఆయన ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని కార్యకర్తలతో చెప్పారు. కానీ, వైసీపీ అధిష్టానం కూడా వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. దీంతో, అధిష్ఠానం దగ్గర ఆయన ఓ మెలిక పెట్టారు. తన కుమారుడికి ఎమ్మెల్యేగా పోటీలో దించితే.. ఎంపీగా తాను కర్నూలు నుంచి పోటీ చేస్తానని చెప్పారట. అధిష్టానం ఎలాగూ తన కొడుకుకి టికెట్ ఇవ్వదు కనుక అదే కారణంగా చెప్పుకొని కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్దం చేశారట. వైసీపీ ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించిన తర్వాత జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన రాయలసీమలో లేరు. బెంగళూరులో ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడు కర్నాటక కాంగ్రెస్ నేతలతో ఆయన మంతనాలు జరిపారని జోరుగా ప్రచారం జరిగింది. కర్నాటక మంత్రులతో జయరాంకు బంధుత్వం ఉంది. అలా ఏపీ కాంగ్రెస్‌లో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు.

 

ఇక రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి కూడా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఆయనకు టికెట్ దక్కే పరిస్థితి లేదని చర్చ నడుస్తోంది. దీంతో, ఆయన కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. వైసీపీ 175 స్థానాలకు టికెట్లు ప్రకటించిన తర్వాత రాయలసీమలో డజను మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగా తెలుస్తోంది. రాయలసీమలో కూడా వైసీపీ ఓడిపోతే ఇక జగన్ రాజకీయ భవిష్యత్ ఇక అంతే అని చర్చ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -