Vijaya Shanthi: సీనియర్ ఎన్టీఆర్ విజయశాంతికి సారీ చెప్పడానికి అసలు కారణమిదా?

Vijaya Shanthi: నేడు నందమూరి తారకరామారావు శతజయంతి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా సినీ ప్రేమికులు రాజకీయ నాయకులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే విజయశాంతి ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ గతంలో జరిగిన ఒక అనుభవం గురించి పంచుకుంది. తన పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చింది విజయశాంతి. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న తారక రామారావు గారు, డా.ఎన్టీఆర్ గారు.. నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది.

1980లో ఆ చిత్రంలో వారిద్దరితో కలసి నటించాను. ఆ తరువాత 1985లో నేను నటించిన ప్రతిఘటన చిత్రానికిగాను ఎన్టీఆర్ గారే ముఖ్యమంత్రి హోదాలో నాకు నంది అవార్డు అందించారు. ఆ తరహా సినిమాలు మరిన్ని చేయాలని ప్రోత్సహించి అభినందించి ఆశీర్వదించారు. నటునిగా, నాయకునిగా వారిది తిరుగులేని జీవన ప్రస్తానం. ఇక ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి చిన్న ఉదాహరణ. బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం డబ్బింగ్ ఎన్టీఆర్ గారు ఏవీఎం స్టూడియోలో చెబుతున్నప్పుడు 1990లో నేను చిరంజీవిగారితో అదే స్టూడియోలో సినిమా చేస్తున్నాం. ఆయన్ని కలవడానికి డబ్బింగ్ థియేటర్ కి వెళ్ళాను. కానీ డబ్బింగ్ థియేటర్ లో వెలుతురు సరిగ్గా లేదు. దీనితో ఎన్టీఆర్ గారు నన్ను గమనించకుండా వెళ్లిపోయారు.

 

ఆ తర్వాత నేను వచ్చిన విషయాన్ని తెలుసుకున్నారు. ఆ మరుసటి రోజే స్వయంగా ఎన్టీఆర్ గారు ఉదయం 6 గంటలకే మద్రాసు లోని మా ఇంటికి వచ్చారు. అదే సమయానికి నేను షూటింగ్ కోసం ఫ్లయిట్ లో హైదరాబాద్ వెళ్లాను. అమ్మాయిని మేము చూసుకోలేదు, పొరపాటు జరిగింది, ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి అని శ్రీనివాస్ ప్రసాద్ గారితో చెప్పిన సంఘటన నాకు ఎప్పటికీ గుర్తుండి ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజు నేను హైదరాబాదులో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఫోన్ చేసి మరీ జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, I am extremely sorry .. అని చెప్పినంతవరకూ సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించని ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించింది విజయశాంతి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -