Klin Kaara: ఉపాసన కూతురు జాతకంలో సీఎం అయ్యే యోగం.. రాజకీయాల్లో సంచలనాలు ఖాయమా?

Klin Kaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనలు వివాహం జరిగి 11 సంవత్సరాల ఆయన సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహం జరిగిన 11 సంవత్సరాలకు ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఉపాసన 20వ తేదీ ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిన్నారికి ఉపాసన దంపతులు లలిత సహస్రనామాలలో ఒకటైనటువంటి క్లీంకార అనే పేరుతో నామకరణం చేశారు.

ఇక ఈ చిన్నారి జన్మించి మూడు నెలలు అవుతున్న ఇప్పటివరకు ఈమె ఎలా ఉంటుంది అనేది మాత్రం అభిమానులకు తెలియదు. ఇంకా మెగా అభిమానులకు తమ వారసురాలిని పరిచయం చేయకపోయినా ఈ చిన్నారి గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్త తెలిసిన క్షణాలలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఎంతోమంది జ్యోతిష్యులు ఈ చిన్నారి జాతకాన్ని చూసి ఈమె జాతకం అద్భుతంగా ఉంది అని చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

చిన్నారి జాతకం చూసినటువంటి వేణు స్వామి వంటి ప్రముఖ జ్యోతిష్యులు కూడా ఈమె జాతకం అద్భుతంగా ఉందని ఈ చిన్నారికి రాజయోగం ఉందని తాత తండ్రిని మించి కీర్తి ప్రతిష్టలు పొందుతుంది అంటూ ఈ చిన్నారి జాతకం గురించి పలువురు జ్యోతిష్యులు తెలియజేశారు. తాజాగా క్లీంకార జాతకం గురించి మరొక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఇప్పటికే మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగబాబు వంటి వారు రాజకీయాలలో చాలా చురుగ్గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. కానీ ఈ చిన్నారి జాతకం ప్రకారం ఈమెకు కూడా రాజకీయ యోగం ఉందని తను కూడా రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని ఈమె పెద్దయిన తర్వాత రాజకీయాలలోకి వస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -