Klin Kaara: మెగా మనవరాలి గురించి అదిరిపోయే స్పెషల్ సాంగ్.. మీరు విన్నారా?

Klin Kaara: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరైన ఉపాసన రాంచరణ్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఈ జంట ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటారు. కాగా ఈ జంటకు పెళ్లయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత ఒక చిన్న పాప జన్మించిన విషయం తెలిసిందే. ఆ పాపకు క్లీంకార అనే పేరును కూడా పెట్టారు. అయితే క్లీంకార ఏ ముహూర్తాన జన్మించిందో గానీ ఆ క్షణం నుంచి ఈ చిన్నారికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. చిన్న వయసులోనే సెలబ్రిటీ హోదాను దక్కించుకుంది.

 

ఈ చిట్టి పాపకు పేరు కూడా అల్లాటప్పాగా పెట్టలేదండోయ్. ల‌లితా స‌హ‌స్ర‌నామాల నుంచి తీసుకున్న ప‌దం. క్లీంకార అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతా శక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంద‌ని, ఆ పేరులోనే శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వెనుక సీక్రెట్ బ‌య‌ట‌పెట్టాడు. కాగా క్లీంకార పుట్టిన‌ప్ప‌టి నుంచి మెగా ఫ్యామిలీ ప్ర‌తి పండ‌గ‌ను మ‌రింత వేడుకగా సెల‌బ్రేట్ చేసుకుంటోంది. నామకరణం చేసిన రోజునే దానిని ఒక పెద్ద ఎత్తున సెలెబ్రేషన్స్ లా నిర్వహించారు మెగా ఫ్యామిలీ. ఇది ఇలా ఉంటే తాజాగా సంక్రాంతిని ఎంతో గ్రాండ్‌గా జ‌రుపుకున్నారు.

హైద‌రాబాద్‌లో కాకుండా బెంగ‌ళూరులో వేడుక‌లు జ‌రుపుకున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీ మొత్తం ఈ వేడుక‌ల్లో పాల్గొన‌డం విశేషం. ఇదిలా ఉంటే క్లీంకార గురించి ఒక పాట రెడీ చేశారు మెగా ఫ్యాన్స్‌. దీన్ని సంక్రాంతి కానుక‌గా ఉపాస‌న విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌హ‌వీర్ ఎల్లంద‌ర్ కంపోజ్ చేసిన ట్యూన్‌కు త‌గ్గ‌ట్లుగా బెల్లంకొండ శ్రీధ‌ర్ లిరిక్స్ రాశాడు. దీన్ని ధ‌నంజ‌య్ అద్భుతంగా ఆల‌పించాడు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పాటను విన్న మెగా అభిమానులు భలేగా ఉంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -