Donkey Milk Cost: గాడిద పాల వ్యాపారం చేస్తూ ఈ వ్యక్తి అన్ని అన్ని రూ.లక్షలు సంపాదిస్తున్నాడా?

Donkey Milk Cost: బ్రతకాలని ఆలోచన ఉంటే ఏది కూడా అసాధ్యం కాదని, అసాధ్యమైన వాటిని సాధ్యం చేయవచ్చని నిరూపించారు. నాగర్ కర్నూల్ కి చెందిన నాగేష్ అనే వ్యక్తి.ఈయన బతుకు తెరువు కోసం ఎన్నో రకాల వ్యాపారాలు చేశారు. అయితే వీటిలో పెద్దగా లాభం రాకపోవడంతో చివరికి తన పెద్ద కుమారుడు అఖిల్ సూచన మేరకు ఏకంగా గాడిదల ఫామ్ ఏర్పాటు చేశారు. ఇలా గాడిదల ఫామ్ ఏర్పాటు చేసి గాడిద పాల ద్వారా నెలకు 10 లక్షల వరకు ఆదాయం అందుకుంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెల్కొండ గ్రామానికి చెందిన నాగేష్ అనే వ్యక్తి ప్రస్తుతం గాడిదల ఫామ్ ఏర్పాటు చేశారు.

నాగేష్ పెద్ద కుమారుడు అఖిల్ గాడిద పాలకు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి డిమాండ్ ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వివిధ రకాల జాతులకు చెందినటువంటి గాడిదలను ఏర్పాటు చేసి ప్రతిరోజు గాడిద పాల ద్వారా నెలకు సుమారు పది లక్షల వరకు ఆదాయం అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన ఫామ్ హౌస్ లో 110 గాడిదలను పెంచుతున్నారు. గాడిదల కోసం ప్రత్యేకంగా 16 ఎకరాలు భూమి లీజుకు తీసుకొని వాటికి కావలసిన వసతిని ఏర్పాటు చేశారు.

 

అలాగే ఈ గాడిదలను చూసుకోవడం కోసం 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇలా ప్రతిరోజు ఒక గాడిదకు సుమారు 20 కిలోల వరకు దాన వేస్తున్నట్లు అఖిల్ తెలిపారు.ఇక ప్రతిరోజు ఒక పూట మాత్రమే గాడిద పాలు పితుకుతారని ఒక్కో లీటర్ ధర సుమారు 2000 నుంచి 5000 వరకు ధర పలుకుతుందని తెలియజేశారు. గాడిద పాలు మనం ఫ్రిజ్ లో నిల్వ చేస్తే దాదాపు రెండు నెలల వరకు పాడవవు ఇలా వీరు ప్రతిరోజు సేకరించిన పాలను ఫ్రిజ్లో నిల్వచేసి నెల తర్వాత తమిళనాడుకు చెందిన ఓ కంపెనీ వీరి నుంచి పాలు తీసుకెళ్తుంది.

 

ఇలా సుమారు నాగేష్ గాడిదల ఫామ్ ద్వారా 10 లక్షల రూపాయలు లాభం అందుకుంటున్నారని అయితే దాన ఖర్చులు సిబ్బంది ఖర్చులు పోను నెలకు 7 లక్షల వరకు లాభం పొందుతున్నారని తెలుస్తోంది. గాడిద పాల ద్వారా విదేశాలలో ఎన్నో కాస్మెటిక్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఇక నాగేష్ ఏర్పాటు చేసిన ఈ గాడిదల ఫామ్ చూడటం కోసం వచ్చే పర్యాటకుల నుంచి దాదాపు 1000 రూపాయల వరకు చార్జెస్ వసూలు చేస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా గాడిద పాల ద్వారా ఈ స్థాయిలో లాభం పొందడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -