YSRTP: వైఎస్సార్టీపీ విషయంలో తెలంగాణలో జరిగేది ఇదేనా?

YSRTP: వైయస్సార్ కుమార్తె షర్మిల తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి అక్కడ రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె ప్రత్యేకంగా పార్టీని స్థాపించడమే కాకుండా తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తాను అంటూ పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టారు. ఇలా నిరుద్యోగులు తరపున ఈమె పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే గత కొద్ది రోజులుగా షర్మిల పార్టీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అందుతున్న సమాచారం ప్రకారం షర్మిల తన వైఎస్సార్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారని సమాచారం. ఇలా కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీని విలీనం చేసి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన పార్టీని విలీనం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

 

ఇదిలా ఉండగా షర్మిల తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా పుట్టినరోజు సందర్భంగా షర్మిల తనకు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో నిజంగానే తెలియడం చేయబోతున్నారంటూ అందరికీ స్పష్టం అవుతుంది.వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్ర‌రావు మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ష‌ర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్ర‌క్రియ ప్రారంభించార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

 

ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలతో కలిసి ఈమె ఇప్పటికే ఈ విషయం గురించి చర్చలు కూడా జరిపారు. అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తో కూడా ఇప్పటికే షర్మిల రెండు సార్లు బేటి అయ్యి తనతో చర్చలు జరిపారు. ఏ క్షణమైన ఈ విషయం గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కానీ ఈ విషయం గురించి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు షర్మిల గాని ఏ విధంగానూ స్పందించకపోవడం గమనార్హం.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -