Munugode By-Elections: మునుగోడు ఉపఎన్నికల తర్వాత కేసీఆర్ సర్కార్ కూలిపోతుందా?

Munugode By-Elections: మునుగోడు ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ సర్కార్ కూలిపోతుందా? మునుగోడులో బీజేపీ గెలిస్తే కేసీఆర్ సర్కార్‌ను కూల్చేస్తుందా? అంటే అవుననే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మునుగోడులో బీజేపీ గెలిస్తే కేసీఆర్ సర్కార్‌పై మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశముందనే అంచనాలు వినిపిస్తోన్నాయి. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ దూకుడుగా ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. పోలీసులకు పట్టుబడటం బీజేపీకి కాస్త మైనస్ అయినా.. ఆ పార్టీ రివర్స్ కౌంటర్లతో సెగలు పుట్టిస్తోంది. ఒకవేళ మునుగోడులో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ లోని చాలామంది నేతలు బీజేపీలో చేరే అవకాశముంది.

టీఆర్ఎస్‌ నుంచి ఎక్కువమంది నేతలు బీజేపీలో చేరితే కేసీఆర్ కు చిక్కులు ఎదురయ్యే అవకాశమంది. మునుగోడు ఉపఎన్నికల ప్రభావం వచ్చే ఎన్నికలపై ఉంటుంది కనుక ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ గెలిస్తే కేసీఆర్‌పై పోరును మరింత ఉధృతం చేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే ఆ ఊపులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే బీజేపీ టార్గెట్ గా కేసీఆర్ విమర్శల దాడిని మరింత పెంచారని అంటున్నారు.

మునుగోడులో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ ను ఆ పార్టీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కనుక.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మరింత బలపడే అవకాశం ఉంటుంది. అందుకే బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆదివారం మునుగోడు నియోజవకర్గంలోని చండూరులో జరిగిన బహిరంగ సభలో కూడా బీజేపీ గెలిస్తే ప్రభుత్వాన్ని పడగొడుతుందంటూ ఆరోపించారు. బీజేపీకి డిపాజిట్ వస్తే మరో 20 మంది ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వాన్ని కూల్చేస్తారంటూ విమర్శించారు.

ప్రజలు సహకరించకపోతే ఏమీ చేయలేమని కేసీఆర్ వ్యాఖ్యానించడం కీలకంగా మారింది. తాను రాజ్యాంగబద్దమైన సీఎం పదవిలో ఉన్నందువల్ల కోర్టులో ఉన్న కేసు గురించి మాట్లాడనని తెలిపారు. టీవీల్లో మీరు చూసింది తక్కువని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయని తెలిపారు. ముందు ముందు అన్ని విషయాలు బయపడతాయని తెలిపారు. కేసీఆర్ కామెంట్లను బట్టి చూస్తే ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సంచలన విషయాలు చాలా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలపై తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఆధారపడి ఉంది. మునుగోడు ఉపఎన్నిక తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారే అవకాశముంది. బీజేపీ గెలిస్తే కేసీఆర్ కు చిక్కులు ఎదురయ్యే అవకాశముంది. ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే బీజేపీ దూకుడుకు కాస్త తగ్గే అవకాశముంది. ఇక కాంగ్రెస్ ఓడిపోతే ఆ పార్టీ పూర్తిగా చతికిలపడే అవకాశముంది. దీంతో మునుగోడు ఫలితం తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -