Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నికపై కీలక సర్వే.,,.. గెలుపు ఆ పార్టీదేనా?

Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నికలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది. పార్టీలన్నీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తోన్నాయి. ప్రచారాన్ని ముమ్మరం చేస్తోన్నాయి. నవంబర్ 6న ఎన్నికల పోలింగ్ జరగనుంది. అంటే ఎన్నికల పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో నవంబర్ 1న సాయంత్రం ఐదు గంటలకు మునుగోడు ఉపఎన్నిక ప్రచారాన్ని తెరపడనుంది. ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉపఎన్నిక ప్రచారాన్ని సమయం ఉండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. కొత్త వ్యూహలతో ప్రచారస్త్రంలో ముందుకెళ్తున్నాయి.

తాజాగా బీజేపీ మునుగోడు ఉపఎన్నికకు మేనిఫెస్టోను ప్రకటించింది. 28 అంశాలతో ఓ మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. నవోదయ విద్యాలయంతో పాటు అనేక హామీలు అందులో పొందపర్చారు. అియతే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై విమర్శలు వస్తున్నాయి. అందులో పెట్టిన ఒక్క హామీ కూడా నెరవేరేది లేదని, కేంద్ర ప్రభుత్వం మునుగోడుపై ఏమన్నా స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తుందా అని ప్రశ్నించారు. హుజూరాబాద్, దుబ్బాలో బీజేపీ గెలిచిందని, అక్కడ ఏం అబివృద్ది చేసిందని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చుతుందా.. లేదా అఅనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా బీజేపీ సాయం చేయలేదని, ఇప్పుడు మునుగోడుకు చేస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

బీజేపీని నమ్మడానికి లేదని, ఉపఎన్నికలో గెలుపోందటం కోసమే మేనిఫెస్టోను ప్రకటించాలంటూ ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు ఉపఎన్నికపై ఓ సర్వే సంచలనంగా మారింది. మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందని, 10 నుంచి 12 వేల ఓట్ల తేడాతో బీజేపీ గెలిచే అవకాశముందని ఆ సర్వేలో తేలిందట. గతంలో దుబ్బాక, హూజూరాబాద్ లో ఆ సంస్థ చేసిన సర్వేలు నిజమవ్వడంతో.. ఆ సంస్థపై చాలామందికి నమ్మకం ఏర్పడింది. పారదర్శకంగా సర్వేలు చేస్తారనే పేరు ఆ సంస్ధకు ఉంది. దీంతో ఆ సంస్థ చేసిన సర్వేలలో మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందని తేలిందట. ఇక బీజేపీ పార్టీ కోసం కొన్ని సంస్థలు చేసిన సర్వేలలో కూడా బీజేపీకి 2 నుంచి 3 శాం మెజార్టీ వచ్చిందని వెల్లడించాయట.

బీజేపీ చేసిన సర్వేలలో కూడా పరోక్షంగా టీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చిందని చెబుతున్నారు. మునుగోడులో వామపక్షాలు బాగా బలం ఉంది. గతంలో మునుగోడులో 4 సార్లు వాపపక్ష పార్టీల నేతలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో ఆ పార్టీలు టీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తన్నాయి. ఇది టీఆర్ఎస్ కు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. దాదాపు 10 నుంచి 15 వేల ఓట్లు వామపక్షాలకు ఉన్నాయని, ఆ ఓట్లన్నీ టీఆర్ఎస్ కుప డే అవకాశముందని చెబుతున్నారు. ఇక ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకునే లబ్దిదారుల ఓట్లు ఎక్కువ టీఆర్ఎస్ కు పడే అవకాశాలున్నాయని ఆ సర్వేలో వెల్లడైందట.

ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు రాజగోపాల్ రెడ్డికి ఎక్కువ పడే అవకాశముందని ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉండటం, పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోండటంతో టీఆర్ఎస్ కు పాజిటివ్ ఓటు బ్యాంకు ఉంటుంది. ఇలా చాలా అంశాలు టీఆర్ఎస్ కు కలిసొస్తున్నాయని చెబుతున్నారు. అియతే బీజేపీ కేంద్రంలో అధికారంో ఉండటంతో దుబ్బాక, హుజూరాబాద్ లో చేసినట్లు ఏదైనా మ్యాజిక్ చేసే అవకాశముందని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -