Underwear: లోదుస్తులకు వీర్యకణాలకు సంబంధం ఉందా?

Underwear: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి వస్త్రధారణ విషయంలో పూర్తిగా మార్పులు వచ్చాయి. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.. ఇందులో భాగంగా స్త్రీ పురుషుడు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే అయినా సంతానం కలగలేదు అంటే స్త్రీ పురుషుల ఇద్దరి సమస్య కారణం అయ్యి ఉండవచ్చు.. కొన్ని కొన్ని సార్లు పురుషుల వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కూడా పిల్లలు కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండడానికి పురుషుల ఆహారపు అలవాట్లతో పాటు వేసుకునే దుస్తులు కూడా కారణం అవుతాయి అంటున్నారు నిపుణులు. అదేంటి పురుషులు వేసుకునే దుస్తులకు వీర్యకణాలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మగవాళ్ళు వేసుకునే లోదుస్తులు వీర్యకణాలపై ప్రభావాన్ని చూపుతాయా అంటే అవును అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా సంతాన ప్రాప్తి కలగకపోవడానికి కూడా దుస్తులు కూడా కారణం అని అంటున్నారు. నిజానికి మగవాళ్లు వారికి సౌకర్యంగా ఉండే వాటిని లోదుస్తులుగా వేసుకొంటారు.

 

అయితే బాక్సర్లు వేసుకొన్న వారిలో స్పెర్మ్‌ కౌంట్‌ ఎక్కువగా ఉండగా బ్రీఫ్స్‌ లేదా జాకీలు వేసుకొన్న వారిలో తక్కువగా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. ఇదే విషయంపై ఒక అధ్యయనం జరపగా.. బాక్సర్లు ధరించే వారిలో పోల్చుకుంటే 25శాతం వీర్యకణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారట. అలాగే పురుషులు చాలామంది బిగుతుగా ఉండే అండర్ వేర్స్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అలాంటివి ధరించకూడదు అని అంటున్నారు నిపుణులు. వీర్యకణాల సంఖ్య తగ్గకుండా ఉండాలి అంటే అలా బిగుతుగా ఉండే అండర్ వేర్స్ కంటే వదులుగా ఉన్న లోదుస్తులు ధరించడం మంచిది అని చెబుతున్నారు. వాస్తవానికి వీర్య వృద్ధి ఒక్కోవారం ఒక్కోలా ఉంటుందని, కౌంట్‌ తక్కువగా ఉన్నా సంతాన ప్రాప్తికి అడ్డుకాబోదని పలువురు చెబుతున్నారు. అలాగే పురుషులు చాలామంది ఎప్పుడూ జీన్స్ ప్యాంట్ ధరిస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ర్యాషెష్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -