Kesineni Nani: వైసీపీ కేశినేని నానికి మరో భారీ షాకివ్వబోతుందా.. ఏమైందంటే?

Kesineni Nani: తిరువూరు బహిరంగ సభ నేపథ్యంలో తలెత్తిన వివాదాలతో నాని తెదేపాకి రాజీనామా చేశారు. ఆ మర్నాడు కేశినేని కుమార్తె శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. కేశినేని కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నతో విభేదాలు తలెత్తాయి. రెండు విడతలుగా విజయవాడ ఎంపీగా పనిచేసిన నాని పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.

 

అయితే కేశినేని నాని తెదేపా కి రాజీనామా చేసిన వెంటనే వైసీపీలోకి మారితే ఎంపీ టిక్కెట్ మాత్రమే కేటాయించారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఇతర అసెంబ్లీ టికెట్లను నానికి కేటాయించే అవకాశాలు ఉండకపోవచ్చు అని అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే ఇంకా విజయవాడ ఎంపీ సమన్వయకర్తగా పార్టీలో చేరకుండానే నియమితులైన నాని మీద ఎక్కువ ఆలస్యం కాకుండానే పిడుగు పడిందన్న ప్రచారం జరుగుతుంది.

మైలవరం నియోజకవర్గాన్ని చూసుకోవాలని వైసీపీ హై కమాండ్ తాజాగా ఆదేశించింది. దీనికి కారణం వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరం జరుగుతున్నారు. ఏలూరులో నిర్వహించే సభకు తాను రాను అని ఖరాఖండీగా చెప్పేశారు. అయితే మైలవరం టికెట్టు ఇస్తామని చెప్పడంతో ఆయన మళ్లీ పార్టీలోకి వచ్చారు. అయితే ఆయనకి పెద్ద ఎత్తున బిల్లులు రావాల్సి ఉంది వాటి కోసమే ఆయన మళ్లీ వచ్చారని నియోజకవర్గంలో నేతలు అనుకుంటున్నారు. అయితే ఆ బిల్లులు వసూలు అయ్యాయో లేదో తెలియదు కానీ మళ్ళీ పార్టీకి దూరమయ్యారు కృష్ణ ప్రసాద్.

 

ఈ విషయాన్ని కనిపెట్టిన వైసీపీ కేసినేని నానిని మైలవరం గురించి చూడాలని సలహా ఇచ్చారు. ఆయన కూడా రంగంలో దిగి వైసీపీ క్యారెక్టర్ తో సమావేశం అయ్యారు. ఒకప్పుడు ఎంపీ సీటు ఇస్తామని ప్రలోభ పెట్టిన వైసీపీ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ తో సరిపెట్టుకోమనటంతో నాని పరిస్థితి కుడితి లో పడ్డ ఎలక లాగా తయారైంది అంటున్నారు తెలుగుదేశం వర్గం వారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -