Jagan: జగన్ మెప్పు కోసం ఈ నేతలు చేస్తున్న పనులు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Jagan: ఆరు మాసాలు వారితో ఉంటే వారే వీరు.. వీరే వారు అవుతారని అంటారు. అంటే.. మనం కొంతకాలం ఎవరితో ఉంటే వారి అలవాట్లు, బుద్దు వస్తాయని దీనర్థం. ఈ సామెతలో ఎంత నిజముందో తెలియదు కానీ.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేత తీరును చూస్తే కాదనలేం. రాజకీయ అవసరాల కోసం, స్థానిక పరిస్థితుల వలన పార్టీలు మారడం సహజంగా మారిపోయింది. అది తప్పా ఒప్పా అనే డిబేట్ మొదలు పెడితే గంటలు గంటలు సాగుతుంది కానీ.. పరిష్కారం దొరకదు. ఎందుకంటే.. పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవడానికి తీసుకొచ్చిన ఫిరాయింపు నిరోధక చట్టమే కోరలు తెంచిన పాములా ఉంది. కాబట్టి మన డిబెట్లతో సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే పొరపాటే. అయితే.. పార్టీ మారుతున్నవారు. అప్పటి వరకు దేవుడు, రాముడి అని పొగిడిన నేతనే రాక్షసుడు, రావణాసురుడు అంటున్నారు. అంతవరకూ ఎవరిని అయితే తిట్టారో వారిపై పేదల పెన్నిధి అని ప్రసంశల్లో ముంచేస్తున్నారు. నరం లేని నాలుకు ఎటు అయినా తిరుగుతుందని అంటారు. కానీ, ఇంత ఘోరంగా తిరుగుతుందని అనుకోరు. ఏపీలో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.

 

టీడీపీలో ఉన్నపుడు నిప్పు ఉప్పు అని చంద్రబాబు చెప్పిన కేశినేని నాని వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఆయన మోసగాడు, లోకేష్ వేస్ట్‌గాడు అంటున్నారు. ఇక జగన్ లక్ష కోట్ల ప్రజాధనం తిన్నారని విమర్శలు చేసిన ఆ నోటితోనే ఇప్పుడు ఆయన పేదల పెన్నిధి అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు మోసగాడు అని ఇప్పుడు తెలిసిందా? 15 ఏళ్లు టీడీపీలో ఉన్నపుడు ఏం చేశారని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధనం ఉండదు. అంటే, రాజకీయ అవసరాల కోసమే ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తారా? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కేశినేని మాత్రమే కాదు.. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ప్రతీ ఒక్కరూ జగన్ లక్షణాలను బాగా పునికి పుచ్చుకుంటున్నారు. విడదల రజనీ టీడీపీలో ఉన్నపుడు చేసిన కామెంట్స్, వైసీపీలో అది కూడా అసెంబ్లీలో ఉన్నపుడు చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు అభివృద్దికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పిన రజనీ ఇప్పుడు ఆయనను రాక్షసుడు అంటున్నారు. సైబరాబాద్‌లో మీరు నాటిన మొక్క ఇప్పుడు మహా వృక్షంగా మారింది సార్ అని చెప్పిన రజనీ.. వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబును దుర్మార్గుడిగా విమర్శలు చేశారు. ఇక.. కొడాలి నాని రోజాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబును, లోకేష్‌ను తిట్టడానికి ముందు వరుసలో ఉంటారు.

 

ఒక్కసారి వైసీపీలో చేరిన తర్వాత ఎందుకు ఇలా మారుతున్నారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబునో, లోకేష్‌నో, పవన్ నో తిడితే ప్రజలు నమ్మేస్తారా? అంటే నిజాన్ని అర్థం చేసుకోలేనంత అమయాకులు కాదు. కానీ, ఇలాంటి వ్యవహారం వలన భవిష్యత్ రాజకీయాలు మరింత దిగజారుడుగా మారే ప్రమాదం ఉంటుంది. ఈ రోజు చంద్రబాబును గట్టిగా తిట్టిన కొడాలినాని, రోజా, అబంటి రాంబాబు, విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్ లాంటివారు మంత్రులు అయ్యారు. అంటే.. విపక్షాలపై వ్యక్తిగత దూషణలకు దిగితే.. మంత్రులు అవ్వొచ్చు అనే అభిప్రాయం జనాల్లోకి, భవిష్యత్ రాజకీయ నేతల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఈ విమర్శల వలన చంద్రబాబు పోయేది ఏమీలేదు. భవిష్యత్ రాజకీయాలే దిగజారిపోతాయి.

 

టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వారే కాదు.. వైసీపీ నుంచి టీడీపీ వైపు వెళ్లిన వారు కూడా ఉన్నారు. వాడు అడపాదడపా మాట్లాడితే.. పాలసీలపై మాట్లాడుతున్నారు. కానీ, మరీ ఇంతలా దిగజారిపోలేదు. చంద్రబాబు వారితో తీవ్రమైన విరమ్శలు చేయించలేరా? 45 ఏళ్లుగా సుధీర్ఘ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఎందుకు అలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం లేదో వైసీపీ నేతలు అర్థం చేసుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -