Kesineni Chinni: టికెట్ల పేరుతో కోట్లు వ‌సూలు చేశాడట.. ఈ ప్రశ్నలకు సమాధానముందా నాని?

Kesineni Chinni: విమర్శలు ఎవరైనా చేస్తారు. కానీ, మనపై ఎవరైనా విమర్శలు చేస్తే దానికి సమాధానం చెప్పాల్సి వచ్చినపుడు రోజు వచ్చినపుడు తెలుస్తుంది. కేశినేని నాని పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన మరుక్షణం నుంచి చంద్రబాబు, లోకేష్ పై కేశినేని నాని సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు మహానుభావుడు అన్న నోటితోనే.. ఆయన దొంగ.. రాక్షసుడు అని విమర్శిస్తున్నారు. అంతేకాదు.. చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం నుంచి టీడీపీలో చేరిన తర్వాత కూడా కేశినేని నాని ఇలాగే చిరంజీవిపై బురద చల్లే ప్రయత్నం చేశారు. కానీ, ఇప్పుడు ఆయనకు తెలిసి వస్తుంది. ఎందుకంటే.. ఆయనకు పోటీగా ఉన్న కేశినేని చిన్ని కూడా తనదైన శైలిలో నానిపై తెగ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కేశినేని నాని కాస్త సైలంట్ అవుతున్నా.. చిన్ని మాత్రం ఏమాత్రం తగ్గకుండా విమర్శలకు పదును పెడుతున్నారు. కేశినేని నానికి వైసీపీ టికెట్ ఇవ్వదని ఆయన అన్నారు. ఆయన్ని వైసీపీలో నమ్మేవారు ఎవరూ లేరని కేసినేని చిన్ని విమర్శించారు. జగన్ తన సన్నిహితులకు టికెట్ ఇచ్చి.. నాని గొంతు కోయడం ఖాయమని అనుమానించారు. నాని ఆర్థికంగా దివాళా తీశాడని.. కాబట్టి వైసీపీలో ఎక్కువ కాలం ఉండలేదని చిన్ని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అప్పులపాలైన నాని.. ఆ అప్పులను ఎగ్గొట్టే ప్రణాళిక కూడా సద్ధం చేశారని ఆరోపించారు.

అయితే, ఇప్పుడు కేశినేని చిన్ని మరో బాంబ్ పేల్చారు. కేసినేని నాని వైసీపీలో టికెట్లు ఇప్పిస్తానని చాలా మందిని మోసం చేశాడని ఆరోపించారు. మైలవరం, విశాఖ వెస్ట్ టికెట్ ఇప్పిస్తానని డబ్బు తీసుకున్నాడని విమర్శించారు. నా స్నేహితులకు కూడా టికెట్ ఆశ చూపించారని ద్వజమెత్తారు. వాళ్లు కూడా డబ్బు ఇచ్చారని కేసినేని చిన్ని తన అన్న నానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఓ శుభకార్యం పేరుతో కోట్ల రూపాయలు వసూ చేశాడని మండిపడ్డారు. వారికి తిరిగి ఇవ్వలేదని.. ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండు సార్లు ఎంపీగా ఉన్న కేశినేని నాని పార్టీ కోసం ఏం చేశారని ప్రశ్నించారు. పదేళ్లుగా వైసీపీకి కోవర్టులా పనిచేశారని.. కానీ, చంద్రబాబు ఆ విషయం గుర్తించలేదని చెప్పారు. మొదటే గుర్తించి ఉంటే ఎప్పుడో పార్టీ నుంచి గెంటేసేవాళ్లమని కేశినేని చిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే, కేశినేని చిన్ని విమర్శల్లో ఎంత నిజం ఉందో అనేది పక్కన పెడితే.. ఆరోపణలు ఎదురైతే ఎలా ఉంటుందో నానికి ఇప్పుడు తెలుస్తోంది. చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని నాని చేసిన కామెంట్స్ కు ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో తెలియదు. ఎందుకంటే.. టీడీపీ చంద్రబాబు పార్టీ. టికెట్లు అమ్ముకుంటే పార్టీకి మనుగడ ఉండదు అనే సంగతి ఆయనకు తెలుసు. కానీ, వైసీపీలో టికెట్లు ఇప్పిస్తానని నాని కొంతమంది దగ్గర డబ్బు తీసుకున్నారనే విమర్శల్లో నిజం ఉండే ఉండొచ్చని ప్రజలు నమ్మొచ్చు. కాబట్టి కేశినేని చిన్ని చేసిన విమర్శలకు నాని కచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -