Balineni: వైసీపీ బాలినేనిని వదిలించుకోవడానికి అసలు కారణమిదేనా?

Balineni: కొన్ని కొన్ని సార్లు మనతో ఉండేవాళ్ళు మనల్ని వెన్నుపోటు చేసే ప్రయత్నం చేస్తున్న కూడా పసిగట్ట లేకపోతాం. ఇటువంటి ఎక్కువగా రాజకీయాలలో కనిపిస్తూ ఉంటాయి. పార్టీలోనే ఉంటూ పార్టీ నేతలు చేస్తున్న వెన్నుపోటును గమనించలేక పోతారు కొందరు. ఇప్పుడు అటువంటిదే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎదురవుతుందని తెలుస్తుంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీలో మంత్రిగా కొన్ని బాధ్యతలు చేపట్టాడు.

అయితే గత కొంతకాలం నుంచి తనకు పార్టీలో అవమానాలు ఎదురవటంతో తాజాగా పార్టీ పదవులకు రాజీనామా చేశాడు. అయితే అతడు రాజీనామా చేయటంతో వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నామని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ అక్కడ ఏం జరగట్లేదు అని తెలుస్తుంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ టికెట్ కూడా లేదన్న సంకేతాలు కూడా ఇస్తున్నట్లు తెలిసింది.

 

దీంతో బాలినేని మరింత బాధ పడినట్లు తెలుస్తుంది. రీసెంట్ గా ప్రోటోకాల్ వివాదం తర్వాత జగన్ బాలినేనిని ప్రత్యేకంగా పిలిపించి స్వయంగా ఆయన చేతనే విద్యా దీవెన పథకం బటన్ నొక్కించాడు. అంతేకాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో బాలినేని మాటే ఫైనల్ అని జగన్ సంకేతాలు ఇచ్చినట్లు కొందరు అనుకున్నారు.

 

అయితే జగన్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్లీ పరిస్థితులు ముందుకు వచ్చాయి. ఎవరు కూడా బాలినేనిని పట్టించుకోవడం లేదని అర్థం అయింది. ఇక పార్టీ నుంచి కూడా ఎటువంటి సమాచారం లేకుండా పోవడంతో.. లోలోపల ఆయనకు వ్యతిరేకంగా పని నిర్ణయాలు జరిగాయని తెలుస్తుంది. ఇక అధికారుల బదిలీతో పాటు పలు నియోజకవర్గాలలో తను పెట్టిన వారిని తప్పించినట్లు తెలవటంతో.. ఇక ఆయన పార్టీ ప్రజలకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు.

 

అయితే కొందరు.. బాలినేనిని అసలు పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారని.. కానీ అది ఆయనకు అర్థం కాలేదు అని.. ఇక జగన్ తనను మోసం చేయరన్న భావనలో బాలినేని ఉన్నాడని.. చివరికి వచ్చే ఎన్నికల టికెట్ లేదన్న సంకేతాలు పంపారని అంటున్నారు.. మొత్తానికి ఆయనను పార్టీ నుండి వెళ్ళగొట్టాలని ప్రయత్నించారని ఇప్పుడు అదే జరిగిందని వైసీపీ నేతలు అనుకుంటున్నారని ఆయన అనుచరులు అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -