Eluru: ఎన్నికల ప్రచార సభ కోసం విధ్వంసం.. ఇలా వ్యవహరించారా?

Eluru: ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభ కోసం పంట కాలువను పూడ్చేసి జాతీయ రహదారిపై డివైడర్ సైతం ధ్వంసం చేసి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యా సంస్థలకు అనధికారికంగా సెలవులు ప్రకటించి ఇంటర్ పరీక్షను కూడా వాయిదా వేసేసారు. ఇదంతా జగన్ సిద్ధం సభ కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అని భయం కూడా లేకుండా చెన్నై కోల్ కత్తా జాతీయ రహదారిపై సుమారు 50 మీటర్ల మీద డివైడర్ ను ధ్వంసం చేశారు.

 

సభ లోపలికి వెళ్లేందుకు దారి కోసం పొలాలకు నీళ్లు అందించే పంట కాలువను ఎనిమిది వందల మీటర్ల మేర పుడ్చేశారు. మొన్న విశాఖ సమీపంలోని ఉత్తరాంధ్ర జిల్లాల సభ జరిగినప్పుడు అలాగే చేశారు. శనివారం ఉమ్మడి కృష్ణ ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పాలగూడెం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఏలూరు పట్టణంలో సిద్ధం పోస్టర్లకు అడ్డుగా వస్తున్నాయి అంటూ పచ్చని చెట్లను కొట్టేశారు. ఇప్పుడు మరింత తెగించి ఏకంగా జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్ ని తవ్వేశారు.

సభా ప్రాంగణానికి దాదాపు అర కిలోమీటర్ల దూరంలో హెలిపాడ్ ఏర్పాటు చేశారు. రోడ్లు వేయడం ఎలాగో చేతకాదు కానీ ఒక ఫక్ రాజకీయ సభ కోసం హైవేని తవ్వెయడం ఏమిటి అని జనం విస్తుబోతున్నారు. జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభకు జనాన్ని తరలించేందుకు పాఠశాలలు,కాలేజీలు బస్సులను అధికార పార్టీ బలవంతంగా తీసుకుంటోంది. ఉమ్మడి గుంటూరు కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలో అంతటా ఈ పరిస్థితి నెలకొంది. ఇష్టం లేకపోయినా విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులు అప్పగిస్తున్నాయి.

 

దీంతో విద్యాసంస్థలు శనివారం అనధికారికంగా సెలవు ప్రకటించేసాయి. కృష్ణ యూనివర్సిటీ అధికారులు సెలవు ఇచ్చినట్లు చెప్పకుండా ఆర్టీసీ బస్సులన్ని సీఎం సభకు వెళ్తున్నాయి. విద్యార్థులు ప్రత్యమ్యాయ రవాణా ఏర్పాటు చేసుకోవాలి అంటూ అదే తెలివి ప్రదర్శించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 20 వేల మంది నైనా తరలించాలంటూ ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -