Rajinikanth: ఇది కదా రజనీకాంత్ రేంజ్.. జైలర్ ఫస్ట్ డే కలెక్షన్లు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించగా ఈ సినిమాలో తమన్నా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, యోగి బాబు వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు.ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైంది.

ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజై హిట్ టాక్‌ని సంపాదించుకుంది. మొదటి షో తో అందరి దృష్టిని ఆకర్షించిన జైలర్ కలెక్షన్స్ పరంగా కూడా సూపర్ హిట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మరి దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఏ ఏ ప్రాంతంలో ఎంత మేర కలెక్షన్స్ రాబట్టింది అనే విషయానికి వస్తే…

 

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఏకంగా రూ. 9 కోట్ల గ్రాస్‌ వ‌సూళ్ళు సాధించి సంచలనం సృష్టించింది. ఇక కేరళలో రూ. 5 కోట్లు, కర్ణాటకలో రూ10 కోట్లు ఇలా ఆల్ ఇండియా లెవెల్ లో రూ. 49 కోట్ల భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. తమిళనాడులో రూ.52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్‌ సంపాదించిన జైలర్.. రూ.80 కోట్ల భారీ కలెక్షన్లు రాబ‌ట్టింద‌ట‌.

 

ఈవిధంగా మొదటి రోజు ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన మొట్టమొదటి తమిళ సినిమాగా ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది.ఇక రజనీకాంత్ నటించిన గత కొన్ని సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేకపోయాయి. కానీ సినిమా మాత్రం సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -