Volunteers: వాలంటీర్లు, సంక్షేమ పథకాల వల్ల 150కు పైగా సీట్లు వస్తాయా?

Volunteers: ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలతో తమ డప్పులు తామే కొట్టుకుంటూ ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక హామీలని, రకరకాల వ్యూహాలని పన్నుతూ రాజకీయ చదరంగం ఆడుతున్నారు. 2019 వైసీపీ అధికారంలోకి వస్తూనే మళ్లీ వచ్చే ఎన్నికలలో గెలవడం కోసం అప్పుడే సంక్షేమ పథకాలని అమలు చేయటం ప్రారంభించింది.

సంక్షేమ పథకాలతో లబ్ది పొందుతున్న వారందరూ వైసీపీ కి ఓట్లు వేస్తారని నమ్మకం కోల్పోయారో ఏమో మంత్రులను, ఎమ్మెల్యేలను జగన్ గడపగడపకి వెళ్లి మరీ తమ పథకాలను గురించి నొక్కి చెప్పమంటున్నారు. ప్రస్తుత సీఎం జగన్ మరొక ఆయుధం సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. వైసీపీ కోసమే వీటిని సృష్టించినట్లు ఇప్పటికే అందరూ అర్థం చేసుకున్నారు. ఈ పథకాల కోసం చేసిన అప్పుల భారం లబ్ధిదారులతో రాష్ట్రంలో మిగిలిన ప్రజలందరి మీద పడింది దీనివలన అన్నింటిని ధరలో ఛార్జీలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు.

 

అయితే వారి కోపాన్ని అసంతృప్తిని అసహనాన్ని నేరుగా ప్రభుత్వానికి చెప్పలేరు. చెప్పినా ఉపయోగం ఉండదు అందుకే వచ్చే ఎన్నికలలో తమ ఓటు ద్వారానే తమ తీర్పుని వెలువరిస్తారు. అయితే ఈసారి ఎన్నికలలో ప్రజలు సంక్షేమ పథకాలపై తీర్పు ఏం చెప్పబోతున్నారు. సంక్షేమ పథకాల వల్ల ఆయన 150 సీట్లు సాధిస్తారా అనేది ప్రశ్నార్ధకమే. ఎందుకంటే వైసీపీ కంటే మిగిలిన ప్రతిపక్ష నేతలకి లభిస్తున్న ప్రజాధరణ చూస్తే వైసీపీకి గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితి వచ్చినట్లుగా కనిపిస్తుంది.

 

వాలంటీర్ వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు ప్రజలందరికీ బాగానే కనెక్ట్ అయ్యాయని చెప్పవచ్చును. పాపం జగనన్న తన సంక్షేమ పథకాలను రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి తీవ్రమైన అవమానాలని అపనమ్మకాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన సృష్టించిన అస్త్రాలు వచ్చే ఎన్నికలలో ఆయనకి ఉపయోగపడవు అని ఒక తీర్మానానికి వచ్చిన ప్రత్యర్థులు ఆయనని కర్ణుడితో పోల్చుతూ తెగ ఆనంద పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -