AP Voters: ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు.. వాళ్ల ఓట్లు ఇంకా ఉన్నాయా?

AP Voters: ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక్క ఓటు అహంకారపు అధికారాన్ని నేలమట్టం చేస్తుంది. ఓటరు కి ఓటు వజ్రాయుధం లాంటిది. అలాంటి ఓట్లను గల్లంతు చేసేస్తున్నారు రాజకీయ నాయకులు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో తవ్వేకొద్దీ లెక్కలేనని అక్రమాలు అవకతవకలు లోపాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఏ పోలింగ్ కేంద్రంలో చూసిన మృతుల ఓట్లు జాబితాలో కనిపిస్తూనే ఉన్నాయి.

 

ఒకటికి మించి ఓట్లు కలిగిన వారు ప్రతి కేంద్ర పరిధిలోను ఉన్నారు. స్థానికంగా నివసించని శాశ్వతంగా వలస వెళ్లిపోయిన వారి పేర్లు కూడా జాబితాలో కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఉనికిలో లేని వ్యక్తులకు ఓట్లు ఉన్నాయి. ఒకసారి రెండు సార్లు తప్పులు జరిగితే అవి మానవ తప్పిదాలు అనుకోవచ్చు కానీ తుది జాబితాలో కూడా ఇవే తప్పులు కొనసాగుతుంటే వీటిని అక్రమాలు అవకతవకలు అంటారు.

మొత్తం 2520 మంది ఓటర్ల పేర్లు పరిశీలించగా వాటిలో 1262 పేర్ల కు సంబంధించి లోపాలు, అక్రమాలు అవకతవకలు ఉన్నాయి. నమూనాగా ఒక్కచోట పరిశీలిస్తేనే 4.8% ఓట్లకు సంబంధించి తప్పులు దొరికాయి. అంటే మొత్తం జాబితాలో ఇంకెంత భారీగా అవకతవకలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సామరణ 2024 ప్రక్రియ మొదలయ్యాక ఎన్నికల అధికారులు తొలుత ఇంటింటి సర్వే నిర్వహించారు.

 

అందులో గుర్తించిన లోపాలు అక్రమాలు, అవకతవకలను సరిదిద్దకుండానే ముసాయిదా జాబితా విడుదల చేసేసారు. అందులోని తప్పులపై ప్రతిపక్ష పార్టీలు పదేపదే ఫిర్యాదులు చేసిన పత్రికలు ప్రసారమాధ్యమాల్లో విస్తృతంగా కథనాలు ప్రచురితమైన ఎన్నికల సంఘానికి క్షేత్రస్థాయిలో ఎన్నికలు విధులు నిర్వహిస్తున్న అధికారులకు అవేవీ పట్టలేదు. దాంతో తాజాగా విడుదలైన తుది జాబితా సైతం లోపభూయిష్టంగా మారింది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ముక్కున వేలేసుకునే కథలు బోలెడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -