YCP MLA: మాకు మేలు జరగలేదు.. మా ఇంటికి రావద్దు.. వైసీపీ ఎమ్మెల్యేకు మహిళ భారీ షాకిచ్చిందిగా!

YCP MLA: ఏపీ ప్రభుత్వం గడపగడపకు మన ప్రభుత్వం అనే పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడకు ఊహించని అనుభవం ఎదురయింది. ఈ సంఘటనలు పెద్దపంజాణి మండలంలో బుధవారం చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే వెంకటేగౌడ ముదరంపల్లి, చామనేరు పంచాయతీల్లో గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నారు. వైకాపాకు చెందిన జడ్పీటీసీ సభ్యురాలు సుష్మకీర్తి స్వగ్రామం ముదరంపల్లిలో ఎమ్మెల్యే ఒక ఇంటికి వెళ్లగా మంజుల అనే మహిళ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు.

మాకేం మేలు జరగలేదు. మా ఇంటికి రావద్దు అంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. సమస్య చెప్పకుండా అరుస్తున్నావ్‌.. ముందు సమస్య చెప్పు అంటూ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఈ ఊళ్లో మాకు మేలు చేసేవారు.. అండగా ఉండేవారు ఎవరూ లేరు వెళ్లిపోండి అని మహిళ అనడంతో చేసేది లేక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు. అలాగే చామనేరు పంచాయతీ పరిధి గోనుమాకులపల్లె, బండకుంట గ్రామాల్లో ఎమ్మెల్యేకు సొంత పార్టీ నాయకులనుంచే చుక్కెదురైంది. చామనేరు సర్పంచి మంజులారెడ్డి తోపాటు ఆమె భర్త, వైకాపా రాష్ట్ర కార్యదర్శి విజయభాస్కర్‌ రెడ్డిలకు, ఎమ్మెల్యేకు మధ్య వర్గ పోరు ఉంది.

 

విజయభాస్కర్‌ రెడ్డి స్వగ్రామంలో ఆయనకు సమాచారం ఇవ్వకుండా గడపగడపకు కార్యక్రమం నిర్వహించాలని తలచారు. దీంతో పంచాయతీ కేంద్రంలో పాక్షికంగా, గోనుమాకుల పల్లె, బండకుంట గ్రామాల్లో పూర్తిగా ఎమ్మెల్యే పర్యటనను గ్రామస్థులు బహిష్కరించారు. ఎమ్మెల్యే వచ్చే ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. చేసేది లేక కార్యక్రమం నిర్వహించకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -