YCP MLA: వైసీపీ ఎమ్మెల్యేపై కార్యకర్త సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

YCP MLA: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనను వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్సీపి కార్యకర్త గుణపాఠి వెంకటేశ్వర రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కలకలం రేపుతోంది ఎమ్మెల్యే గోపిరెడ్డి నుంచి తనను కాపాడకపోతే భార్యతో సహా ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. వెంకటేశ్వర రెడ్డి సెల్ఫీ వీడియోలో ఈ విధంగా చెప్పుకొచ్చారు గత కొంతకాలం క్రితం నరసింగపాడు నుంచి వచ్చి నరసరావుపేటలో స్థిరపడ్డానని..

 

రావిపాడు రోడ్డులో పొలం కొనుక్కొని భార్యతో పాటు జీవిస్తున్నానని ఇటీవల ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యతిరేక వర్గాన్ని తాడేపల్లికి పిలిచి ఎమ్మెల్యే గోపిరెడ్డి వల్ల ఏమైనా సమస్యలు ఉంటే తనకు చెప్పాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. నరసరావుపేటలో 2015 లో 41 సెంట్ల పొలం కొనుగోలు చేశానని విజయసాయిరెడ్డికి తెలిపానని అన్నారు. ఆ పొలం తనకు ఇవ్వమని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనను ఎంతో కాలం నుంచి వేధిస్తున్నారని వివరించానని చెప్పుకొచ్చారు. రెండు దఫాలుగా సుమారు 23 లక్షలు ఇచ్చినా వదిలిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న గోపిరెడ్డి అనుచరులు అర్ధరాత్రి ఇంటికి వచ్చి దాడి చేశారని, అంతేకాకుండా నాపై ఎస్టీ, ఎస్సి కేసులు కూడా 2019 లోనే బనాయించారు. ఈ ఇబ్బందులు కారణంగా నేను రెండున్నర కోట్ల విలువ చేసే ఇంటిని ఒకటిన్నరకోటికి అమ్ముకొని అప్పులు తీర్చుకున్నాను. అయినప్పటికీ వదిలిపెట్టకుండా జాన్ అని వ్యక్తిని పంపించి భూమిని అంతా చదును చేయించుకుంటున్నాడు.

 

అలాగే అర్ధరాత్రి మనుషుల్ని ఇంటికి పంపించి నీఅంతు చూస్తాను, విజయ్ సాయి రెడ్డికి ఫిర్యాదు చేసే అంత మనిషివా అంటూ ఇబ్బంది పెడుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి లు కల్పించుకొని తనను ఎమ్మెల్యే నుంచి కాపాడాలని సెల్ఫీ వీడియో ద్వారా వెంకటేశ్వర రెడ్డి వేడుకున్నారు లేదంటే తన పొలంలోనే ఎమ్మెల్యే పేరు రాసి పురుగుల మందు తాగి తన భార్య ఆత్మహత్య చేసుకుంటామని గుణపాటి వెంకటేశ్వర రెడ్డి హెచ్చరించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -