YCP MLA: అధికార పార్టీపై ఫైర్ అయిన వైసీపీ ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే?

YCP MLA: తాజాగా మరోసారి వైసీపీ ప్రభుత్వం పై మండిపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. గతంలో ఇదివరకే వైసీపీ ప్రభుత్వం పై మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా కూడా ఆయన మరోసారి వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైసీపీ నాయకులు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తన భవిష్యత్తు ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు వసంత కృష్ణ ప్రసాద్. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉందని అన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. బిల్లులు రాక చాలామంది వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, వారందరు రోజూ తన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆయన వాపోయారు. మొదటి మూడేళ్లు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటికి సంబంధించిన బిల్లులు ఏవీ రాక గడిచిన ఏడాదిన్నరగా నేను ఎలాంటి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

 

దానికి తోడు తన భవిష్యత్తు ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుంది అంటూ వసంత కృష్ణ ప్రసాద్ చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. చాలా రోజులుగా వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి జోగి రమేశ్ తో ఆయనకు విబేధాలు ఉన్నాయి. ఇక, టికెట్ అంశానికి సంబంధించి సీఎం జగన్ ను అనేకసార్లు కలిశారు. మొత్తంగా బిల్లులు రాక వైసీపీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారు, కాలమే నా భవిష్యత్తును నిర్ణయిస్తుంది అంటూ వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -