Avinash: జగన్, భారతిలను అవినాష్ ఇరికించారా.. ఏం జరిగిందంటే?

Avinash: ప్రస్తుతం ఏపీలో మారుమోగుతున్న పేరు అవినాష్ రెడ్డి. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పేరు కీలకంగా మారడంతో అనుక్షణం ఏం జరుగుతుందా అని అవినాష్ రెడ్డి ఆయన చుట్టూ ఉన్న రాజకీయ నేతలు టెన్షన్ పడుతున్నారు. దానికి తోడు వైయస్ వివేక కూతురు సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు మరింత బలపడింది. దాంతో అవినాష్ రెడ్డి పేరు మరింత కీలకంగా మారింది. ఇది ఇలా ఉండే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి గందరగోళపడి జగన్, భారతి లను ఇరికించేశారు అంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి.

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతూ.. అవినాష్ రెడ్డి తాను సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్ల విషయంలో కంగారు పడిన విషయాన్ని కూడా తెలిపారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు రెండు సార్లు వెళ్లిన తర్వాత తన స్టేట్‌మెంట్ ఆడియో , వీడియోలు రికార్డులు చేయడం లేదని తన సంతకాలు మాత్రమే తీసుకున్నారని, కానీ మ్యానిపులేట్ చేశారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లారని బీటెక్ రవి చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తన స్టేట్ మెంట్ల విషయంలో మరోసారి రికార్డులు కావాలని కోర్టుకు వెళ్లాడని ఆరోపించాడు.

 

అంతే కాకుండా ఇప్పటికే చేయాల్సినంత చేసి ఇరికించాల్సినంత ఇరికించేసి కంగారు పడుతున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు రవి. అవినాష్ రెడ్డి కంగారు చూస్తే ఎవరికైనా అటువంటి అనుమానమే వస్తుందని, సిబిఐ అధికారులు మాత్రమే కాదు ఏ దర్యాప్తు సంస్థ అయినా విచారణ రికార్డు చేస్తుంది. ఎదురుగా కెమెరా లేకపోయినా కూడా రూమ్లో చుట్టూ ఉన్న కెమెరాలను ముందే అమర్చి అయినా రికార్డ్ చేస్తుంది.. అందులో ఎటువంటి సందేహం లేదు. అయినా చేయలేదు అని అవినాష్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు సిబిఐ అధికారులను నిందితుల్ని పట్టుకోవడం ముఖ్య సూత్రధారులను బయటకు లాగడంలో ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది అని చెప్పుకొచ్చారు రవి. అలాగే అవినాష్ రెడ్డి నుంచి కొన్ని క్లూలు బయటకు లాగి ఇతర విషయాల్లో ఉన్న డౌట్స్ ను క్లియర్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ విషయంపై స్పష్టత రావడంతోనే అవినాష్ రెడ్డిని కాపాడేందుకు చేయాల్సినదంతా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు బీటెక్ రవి. ప్రస్తుతం బీటెక్ రవి చేసిన వాఖ్యలు వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -