YS Jagan: జగన్ ను చూస్తే వాళ్లకు వణుకు పుడుతోందా.. ఏం జరుగుతోందంటే?

YS Jagan: ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా మాత్రమే కాకుండా మూడు రాజధానులను తెరపైకి తీసుకువచ్చారు. ఇలా మూడు ప్రాంతాలలో అభివృద్ధి జరిగితేనే రాష్ట్రం బాగుంటుందని భావించిన జగన్ మూడు రాజధానుల ను తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఈ విషయం కాస్త గందరగోల పరిస్థితులను ఏర్పరచిందని చెప్పాలి. ఇలా మూడు రాజధానులు అవసరం లేదంటూ ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి.

ఈ క్రమంలోనే రాజధానుల విషయం ఏటు తేలని పరిస్థితి ఏర్పడింది. అయితే మూడు రాజధానులు ప్రకటించిన తర్వాత రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సిపి పార్టీకి కాస్త వ్యతిరేకత ఏర్పడిందని తెలుస్తోంది. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో జగన్ పర్యటించాల్సిన పరదా చాటున వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇలా రాజధాని ప్రాంతంలో అడుగుపెట్టడానికి జగన్ కి ధైర్యం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.

 

అయితే కాలం ఎన్నో మార్పులను తీసుకువస్తుందని సమయం వచ్చేవరకు వేచి చూడటమే ఉత్తముడి లక్షణమని జగన్ నమ్ముతారు. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో 51 వేల మంది పేద ప్రజలకు సెంటు భూమి చొప్పున ఇంటి పట్టా ఇవ్వబోతున్నారు ఇలా పేద రైతులకు రాజధాని ప్రాంతంలో సెంటు భూమి అంటే ఎంతో విలువైనదని చెప్పాలి. అయితే ఈ పేద ఇంటి పట్టా పంపిణీ చేయడానికి కూడా ప్రతిపక్షాలు అడ్డుకట్టలు వేసాయి అయితే ఈ అడ్డుకట్టలను తొలగించుకొని ఇంటి పట్టా పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

రాజధాని ప్రాంతంలో తిరగడానికి భయపడే జగన్ ఇప్పుడు అక్కడ తనని విమర్శించడానికి కూడా ప్రతిపక్ష నాయకులు భయపడుతున్నారని తెలుస్తోంది.ఇళ్ల పట్టా పంపిణీ అడ్డుకోవడానికి ప్రతిపక్ష నాయకులకు కూడా సాహసం చేయడం లేదు. తీరా ఎన్నికల సమయంలో ఇల్లు పట్టాల పంపిణీ అడ్డుకుంటే తమకు పూర్తి వ్యతిరేకత వస్తుందన్న కారణంతో ప్రతిపక్ష నేతలు కూడా మౌనం పాటిస్తుండడం విశేషం. ఇదే సీఎం వైఎస్ జ‌గ‌న్ మ్యాజిక్‌. ఒక‌ప్పుడు అమ‌రావ‌తి అంటే తాను భ‌య‌ప‌డే ద‌శ నుంచి భ‌య‌పెట్టే స్థాయికి జ‌గ‌న్ చేరుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -