Vijayamma Brother: జగన్ గాలికబుర్లు చెప్పరు.. విజయమ్మ తమ్ముడి కామెంట్స్ వైరల్!

Vijayamma Brother: క‌మ‌లాపురం ఎమ్మెల్యే, వైఎస్ విజ‌య‌మ్మ త‌మ్ముడు పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి మ‌ళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్రలో భాగంగా లోకేష్ మాట్లాడుతూ రవీంద్రనాథ్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రవీంద్రనాథ్ రెడ్డి భూభాకాసురుడు అంటూ ఆయన పెద్ద ఎత్తున భూ దందాలు చేసి పేద ప్రజల నుంచి భూములు లాక్కున్నారు అంటూ లోకేష్ విమర్శలు చేశారు.

ఈ విధంగా లోకేష్ విమర్శలు చేయడంతో రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ తనని భూ బకాసురుడు అన్న మాటలను ఆయన ఖండించారు తాను ఎక్కడ భూములను ఆక్రమించుకున్నానో చూపించాలంటూ డిమాండ్ చేశారు. నీ పక్కనే పెద్ద బూ తిమింగలాన్ని పెట్టుకున్నావు అంటూ టిడిపి ఇన్ ఛార్జ్
పుత్తా న‌ర‌సింహారెడ్డిపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు.

 

దాదిరెడ్డిప‌ల్లె, దేవ‌రాజుప‌ల్లె, పైడికాల్వ‌, స‌ముద్రంప‌ల్లె త‌దిత‌ర గ్రామాల్లో దాదాపు 400 ఎక‌రాల‌ను త‌న ప్ర‌త్య‌ర్థి ఆక్ర‌మించుకున్నార‌ని ఈయన వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికీ అవ‌న్నీ డీకేటీ ప‌ట్టాలే అని ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే ఆ భూముల త‌మవే అని ప్ర‌జ‌లుఅడగలేకపోతున్నారని ధైర్యం చేసి అడిగితే వారి ప్రాణాలకు ఎక్కడ ప్రమాదం తలెత్తుతుందో నన్న భయంతో ఉన్నారని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

 

ఇక నరసింహారెడ్డి లోకేష్ ను ఉద్దేశించి సార్ అని మాట్లాడటంతో రవీంద్రనాథ్ రెడ్డి ఈ ప్యాఖ్యలను కూడా విమర్శలు చేశారు. తాము అడిగిన వెంట‌నే రూ.600 కోట్లు మంజూరు చేశారు సార్ అంటూ లోకేశ్‌తో పుత్తా న‌ర‌సింహారెడ్డి అన‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. వూళ్లో ప‌ని చేశారు సార్‌, చూపించు సార్ మాకు అని వ్యంగ్యంగా పుత్తాను ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ప్ర‌శ్నించారు. టిడిపి ప్రభుత్వం హయామంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరిగిందని తెలిపారు. నీరు చెట్టు పథకం కింద భారీగా దోచుకున్నారని విమర్శించారు. ఇక చంద్రబాబు నాయుడు మాదిరిగా గాలి మాటలు చెప్పే రకం జగన్ కాదని రవీంద్రనాథ్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -