Amaravati: అమరావతిపై సీఎం జగన్ కు ఇంకా కసి తీరలేదా.. మాస్టర్ ప్లాన్ విషయంలో కొత్త కుట్రలకు తెర లేపారా?

Amaravati: ఏపీ సీఎం జగన్‌కు అమరావతి పేరు వినిపించకూడదు. దాని కోసం ఎన్ని కుట్రలు చేయడానికి అయినా సిద్దం అవుతున్నారు. హైదరాబాద్ అంటే మొదట వినిపించేది చంద్రబాబు పేరు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించి దాని కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున భూ సేకరణ జరిగింది. మాస్టర్ ప్లాన్ కూడా సిద్దం చేశారు. అయితే, ఇంతలోనే ఏపీలో ప్రభుత్వం మారింది. హైదరాబాద్ లాగే.. అమరావతి నిర్మాణం కూడా జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతి నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నించారు. అయితే.. ఐదేళ్లు గడుస్తున్నారు. మూడు రాజధానుల్లో ఒక్క భవనం కూడా నిర్మించలేదు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో చంద్రబాబు మళ్లీ అమరావతి జోలికి వెళ్లకుండా చేయాల్సిన కుట్రలు జగన్ చేస్తున్నారు.

అమరావతి బృహత్‌ ప్రణాళికను దెబ్బ తీసేందుకు కొత్త ఎత్తులు జగన్ మొదలు బెట్టారు.ఈ కుట్రలో భాగంగా హడావుడిగా రాజధాని కోసం జరిగిన భూసేకరణ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. ఇప్పటికే ఓ సారి 21 గ్రామాలకు చెందిన 625 ఎకరాలకు గత ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ ప్రకటనను ఉపసంహరించారు. ఇప్పుడు మరోస తాడేపల్లి మండలం ఉండవల్లలో 113 ఎకరాలకు సంబంధించి కూడా భూసేకరణ ప్రకటనను వెనక్కి తీసుకుంటూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ గెజిట్‌ విడుదల చేశారు. మొత్తం రెండు విడతలుగా భూసేకరణ నుంచి వెనక్కి తీసుకున్న భూమి 738 ఎకరాలకు చేరింది.

అయితే, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రైతలు న్యాయపోరాటానికి సిద్దమవుతున్నారు. ఎన్నికల ప్రకటన వచ్చే లోపే ఎంత వీలైంత అంతగా అమరావతి ప్లాన్ ను డ్యామేజ్ చేయాలని వైసీపీ సర్కార్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే.. భూ సేకరణలో భాగంగా భూమి ఇచ్చిన రైతులకు పరిహారం మంజూరైనా… భూ సేకరణ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నారు.

గత ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌, రోడ్ల కోసం 217.76 ఎకరాలు కేటాయించారు. ఇందులో 191.62 ఎకరాలకు పరిహారం కూడా చెల్లించింది. గుంటూరు కలెక్టర్ విడుదల చేసిన గెజిట్‌లో వీటి జోలికి వెళ్లలేదు. కానీ సడెన్ గా పురపాలక శాఖలోని కీలక అధికారి.. సీఆర్డీఏ అధికారులతో భేటీ అయ్యి.. మాస్లర్ ప్లాన్, రోడ్ల కోసం కేటాయించిన భూములను భూ సేకరణ నుంచి తప్పించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. అయితే.. ఇదంతా చట్టవిరుద్దం. కానీ.. సీఆర్డీఏ అధికారులు ఉపసంహరణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏదైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే చేయాలి. అందుకే అన్ని ప్రకటనలు ఆగమేఘాల మీద రెడీ చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలను రైతులు తప్పు బడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -