Amaravati: అమరావతి కట్టేశామని బ్యాంకుల్ని నమ్మించిన జగన్ సర్కార్.. ఇంత మోసమేంటి అనేలా?

Amaravati: పాలన సాగించడానికి, మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు.. నిజానికి చెప్పాలంటే అవి ప్రయత్నాలు కాదు.. అక్రమాలు, మోసాలు. ప్రతిపక్ష పార్టీ నేతపై కేసులు పెట్టడం. వేధించడం.. ప్రశ్నించే ధైర్యం చేయకుండా ఉండటం ఇలా ఒకటా రెండా గెలవడానికి చేయకూడని ప్రయత్నాలు ఎన్నో చేశారు.. చేస్తున్నారు. ప్రత్యర్థులపై కేసులు, దాడులు అంటే అందరికీ కనిపిస్తాయి. కానీ, పాలన సాగించడానికి ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో చాలా మందికి తెలియదు.

రీసెంట్‌గా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అమరావతి పూర్తి చేశామని వైసీపీ సర్కార్ బ్యాంకులను నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేయడం కాదు.. నమ్మించేసింది. టీడీపీ ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులకు ఉండడానికి ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. 70శాతానికి పైగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి కూడా. ఇంతలోనే ప్రభుత్వం మారింది.  అమరావతి ఆనవాళ్లు లేకుండా చేయాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ చెప్పినట్టు ఎవరో శంకుస్థాపన చేసిన దాన్ని తాను పూర్తి చేయను అని అనుకున్నట్టు ఉన్నారు జగన్. అందుకే అమరావతి అనే మాట ఎత్తడానికి ఇష్టపడలేదు.

కానీ, అక్కడ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామని బ్యాంకులకు లేఖలు రాశారు. వాటిని నమ్మించడానికి ఫేక్ ప్రూఫ్స్ కూడా సిద్దం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు అద్దె కూడా కడుతున్నామని నమ్మించడానికి సీఆర్డీఏ అకౌంట్‌లో రూ. 63 కోట్లు జమచేసి దాని రిసిప్ట్ బ్యాంకులకు చూపించారు అయితే.. ఇవన్ని చేసి బ్యాంకులకు ఎందుకు చూపించాలనే అనుమానం ఎవరికైనా వస్తుంది. అమరావతి హౌసింగ్ ప్రాజెక్టులకు తీసుకున్న రుణ నిబంధనల ప్రకారం వాటిని పూర్తి చేయాలి. లేదంటే, రెండు వేల కోట్లు చెల్లించాలి. అలా చెల్లించకపోతే ఎన్‌పీఏలు పడతాయి. అదే జరిగితే ప్రభుత్వం దివాళ తీసినట్టే. దివాళ తీసినట్టు బయటకు తెలిస్తే ఇంకా అప్పులు పుట్టడం కష్టం అవుతుంది.

అలా అని రూ. 2 వేల కోట్లు ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందా? అంటే అది జరిగే పని కాదు. కావాల్సిన కాంట్రాక్టుర్లకో లేకపోతే మరో పనికో వాడుకుంటారు కానీ.. బ్యాంకులకు ఎందుకు ఇస్తారు. అసలు ఎన్నికల సమయం కనుక ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సింపుల్‌గా సీఆర్డీఏ అకౌంట్‌లో డబ్బులు వేసి ఆ రిసిప్ట్‌తో బ్యాంకులను మోసం చేశారు. లక్ష, రెండు లక్షల రూపాయల లోన్ కోసం నానా యాగీ చేసే బ్యాంకులు జగన్ సర్కార్ ఇచ్చిన రిసిప్టును చూసి నమ్మేశాయి. ఈ విషయం తెలిసినవారు జగన్ మామూలోడు కాదని అనుకుంటున్నారు. అంతేకాదు.. చెబితే అబద్దం చెప్పాడు కానీ.. అమరావతి నిర్మాణం పూర్తి అయిందనే మాట ఎంతబాగుందో అని అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -