Volunteers: వాలంటీర్ల కోసం జగన్ ఏకంగా అలా చేయబోతున్నారా?

Volunteers: ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఎవరు ఊహించని విధంగా ఆయన రాజకీయం చేస్తారు. ఇందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థ ఒకటి. వాలంటీర్లు ఉంటే తమ పార్టీకి ఎంతో భద్రత ఉంటుందని భావించిన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రజల ముంగిట నిలబెట్టారు.అయితే తాజాగా జగన్ వాలంటీర్ల గురించి ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

రెండున్నర లక్ష మంది వాలంటీర్లు ఉండగా ఇందులో ఇద్దరికీ లేదా ముగ్గురికి అసెంబ్లీ స్థానాలలో టికెట్లు ఇవ్వాలని ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయని తెలుస్తుంది. ఇలా వాలంటీర్లకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నారని తెలియడంతో వాలంటీర్లలో కూడా ఆశలు చిగురిస్తున్నాయి.

 

వైసీపీ రాజకీయ వ్యూహంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. రిజర్వుడు నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గం వారిని ఇంచార్జులుగా పెడతారు. ఆ ప్రాంతంలో డమ్మీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెడతారు. ఎవరు గెలిచిన సామాజికవర్గ ఇంచార్జ్ మాత్రమే అనధికారిక ఎమ్మెల్యే అవుతారు. అలాంటి నియోజకవర్గాలను రెండు, మూడింటిని ఇప్పటికే ఐడెంటిఫై చేశారని తెలుస్తోంది.

 

ముఖ్యంగా ఈ విధానం రాయలసీమలో అమలు చేయబోతున్నారని సమాచారం. జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ కన్నా వాలంటీర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక నుంచి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు .. ఇతర ఎన్నికల్లో వైసీపీ తరున నిలబడేందుకు వాలంటీర్లకే ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉందంటున్నారు.ఇలా అన్ని అవకాశాలు వాలంటీర్లకే కల్పిస్తే తమ పరిస్థితి ఏంటి అని క్రింది స్థాయి నేతలు ఈ విషయం పట్ల కాస్త గుర్రుగానే ఉన్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -