YS Jagan: సామాన్యులకు భారీ షాకివ్వబోతున్న జగన్.. భూములు కొనలేరా?

YS Jagan: సామాన్యులు ఆస్తులను కొనుగోలు చేయాలన్న కల కలలుగానే మిగిలిపోతున్నాయని తెలుస్తోంది.ప్రస్తుతం భూముల విలువ మార్కెట్లో అధికంగా ఉంది. అయితే ఉన్నటువంటి భూ విలువలను మరింత పెంచే ప్రయత్నంలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల 75% నుంచి 100% భూమి రేట్లు పెరిగిపోయాయని తెలుస్తుంది. ఇలా భూమి రేట్లు అధికం అవ్వడం వల్ల సామాన్యులు ఆస్తులు కొనుగోలు చేయాలన్న కలలుగానే మిగిలిపోతున్నాయి.

ఇక భూముల ధరలు పెంపు ఎలా ఉండాలన్న విషయంపై ఇప్పటికే కసరత్తులు కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలను జిల్లా అధికారులు, సబ్ రిజిస్టర్లకు అందుతున్నాయి.మరి ఈ భూములు విలువలను వేటి ఆధారంగా పెంచబోతున్నారు అని విషయానికి వస్తే.. ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో 50 గ్రామాలు కనుక ఉంటే గ్రామాలలో దస్తావేజులు రిజిస్ట్రేషన్ల సంఖ్య ఆధారంగా భూముల ధరలను పెంచనున్నారు.

 

ఈ భూముల పెంపుదలలో జాతీయ రహదారుల వెంట ఉన్నటువంటి స్థలాలు విలువలు పరిగణలోకి తీసుకోబోతున్నారు అదేవిధంగా ప్రధాన కూడళ్ళు, పరిశ్రమలు వ్యాపార రంగాలలో జరుగుతున్న అభివృద్ధి కొత్తగా జరిగే అభివృద్ధిని పరిగణలోకి తీసుకొని కొత్త సర్వే నెంబర్లను గుర్తించనున్నారు. ప్రస్తుతం మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి..రిజిస్ట్రేషన్లు మొత్తంలో ఎంత ఆదాయం వచ్చింది అన్న విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని భూముల ధరలను నిర్ణయించబోతున్నారు. భూముల ధరలు పెరగడం వల్ల కొనుగోలుదారుడు చెల్లించాల్సిన స్టాంప్డ్యూటీ రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరుగుతాయి తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్న ఆలోచనలోనే ప్రభుత్వం ఇలా భూమి ధరలను పెంచబోతున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -