Fish market: చేపలమ్ముకునే వాళ్లకు జగన్ సర్కార్ భారీ షాక్.. ఏమైందంటే?

Fish market: ఏపీలో మత్స్యకారుల పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటివరకు చేపలను ఫ్రీగా విక్రయించుకున్న మత్స్యకారులు ఇకపై చేపలు అమ్ముకొని బతకాలి అంటే ఏడాదికి పదివేల రూపాయలు లైసెన్స్ ఫీజు కట్టాల్సిందే. మత్స్యకారులు లైసెన్స్ ఫీజ్ కట్టడం ఏంటా అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే ప్రభుత్వానికి ఇకపై మత్స్యకారులు లైసెన్స్ ఫీజులు కట్టాల్సిందేనట. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే.

సరైన ఆదాయం లేకపోవడంతో ఖర్చులు పెరిగిపోయి ఆదాయ మార్గాల కోసం చూస్తున్న ప్రభుత్వానికి చేపలు అమ్ముకునే మత్య్స కారులు కనబడ్డారు. దాంతో వారిపై పది నుంచి పాతిక వేల రూపాయల వరకూ లైసెన్స్ ఫీజు రుద్దుతున్నారు. ఏపీలో చేతలు అమ్ముకునేవారు ఎక్కువగా చిన్న చిన్న దుకాణాల్లోనే ఉంటారు. ఎప్పటికప్పుడు చెరువు దగ్గర లేదంటే నదుల దగ్గర నుంచి తెచ్చుకుని మార్కెట్ల దగ్గర పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు. వారికి ఆదాయం రోజు కూలీ చేసుకున్నంత వస్తుందో రాదో కూడా తెలియదు.

 

కానీ వారి వద్ద నుంచి ఏకంగా రూ. పదివేలు మాత్రం వసూలు చేసి తీరాలన్న పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే చేపలమ్ముకునే వారిపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్లు తెరిచారు. మత్స్యకారుల పొట్టకొట్టే ప్రయత్నం చేశారు. అయితే అవి సక్సెస్ కాలేదు. వాటికి మాత్రం ఎలాంటి లైసెన్స్ ఫీజు తీసుకోకూడదని ప్రభుత్వం చెబుతోంది. అంటే లైసెన్స్ ఫీజు తట్టుకోలేక చేపలు అమ్ముకునేవారిలో ఎవరైనా ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్లు తీసుకుంటారని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే అందరి పైన పడి భారీగా వసూలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మధ్యకారులపై పడింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -