University: ఆ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న జగన్ సర్కార్.. ఏమైందంటే?

University: సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసే ఉద్యోగి తన ఖర్చులు మొత్తం ఆ జీతం పైనే ఆధారపడుతుంటారు. కుటుంబ పోషణతోపాటు ఎన్నో రకాల ఈఎంఐలు, స్కూల్ ఫీజులు అంటూ కుటుంబం మొత్తం అతని జీతం పైనే ఆధారపడి ఉంటుంది. ఇలా ఒకటో తేదీ వచ్చేలోపు జీతాలు వారి ఖాతాలో పడితే వారికి ఎటువంటి సమస్య ఉండదు అలా కాకుండా జీతాలు కనుక ఆలస్యం చేస్తే కట్టాల్సిన ఈఎంఐలు స్కూల్ ఫీజులు ఇతరతా ఖర్చులు భారంగా మారుతుంటాయి.

ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వ తీరుపై పలువురు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఒకటో నెల జీతాలు పడకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చాలా సందర్భాలలో వెల్లడించారు. అయితే ఈ విషయం మాత్రం ప్రభుత్వానికి పట్టనట్టు ఉందని చెప్పాలి. ఇకపోతే ఒక నెల జీతం ఆలస్యమైతేనే ఎంతో ఇబ్బందులు పడే ఉద్యోగులు ఏకంగా 30 నెలలుగా జీతాలు రాకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో వర్ణాతీతం.

 

ప్రస్తుతం అలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పార్ట్ టైం ఉద్యోగస్తులు.ఇలా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో పార్ట్ టైం ఉద్యోగులుగా చేస్తున్న వారికి దాదాపు 30 నెలలుగా జీతాలు అందకుపోవడంతో ఉద్యోగస్తులు లబోదిబోమంటున్నారు. వీరి బాధలు ప్రభుత్వానికి పట్టలేదా అంటూ పలువురు ఈ విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

 

ఇక పార్ట్ టైం ఉద్యోగస్తులు అయినటువంటి వర్కర్లు, వాచ్మెన్ లు, అటెండర్లు, క్లర్క్ వంటి వారికి జీతాలు చాలా తక్కువగా ఉంటాయి.కనీసం ఈ తక్కువ జీతాలను ఇవ్వలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉందా అంటూ పలువురు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అయితే సీఎఫ్ఎంఎస్ పోర్ట‌ల్‌లో బిల్లులు అప్‌లోడ్ చేయాల‌నే నిబంధ‌న విధించిన తర్వాతే జీతాల చెల్లింపులలో అసమానతలు ఏర్పడ్డాయని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -