Jagan: జగన్ ఆలోచించాల్సిందే.. ఏపీలోని పరిస్థితులను మార్చాల్సిందే!

Jagan: టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న సంస్థల్ని వెంటాడి వేధించి రాష్ట్రం నుంచి తరిమేయడాన్ని ఎజెండాగా పెట్టుకుంది జగన్‌ ప్రభుత్వం. అయితే దానిని ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాల మంచి అవకాశంగా మలుచుకుంటున్నాయి. ఆ సంస్థల్ని సాదరంగా ఆహ్వానించి వారి రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టమని కోరుతున్నాయి. అక్కడి ప్రభుత్వాలు ఎంతో మర్యాదగా వ్యవహరిస్తూ, అవసరమైన సదుపాయాలు కల్పిస్తుండటంతో ఆయా సంస్థలు అక్కడ పెట్టుబడుల ప్రతిపాదనల్ని వేగంగా ఆచరణలోకి తెస్తున్నాయి.

జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసిన భూ కేటాయింపుల్ని రద్దుచేసి, రాష్ట్రం నుంచి తరిమేసిన సంస్థల్లో యూఏఈకి చెందిన లులు గ్రూప్‌ కూడా ఒకటి. వైసీపీ ప్రభుత్వం లులు గ్రూప్‌ను వెళ్లగొడితే… తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం వారిని ఆహ్వానించి అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు 2022 మార్చి 28న దుబాయిలో లులు గ్రూప్‌కి, తమిళనాడు ప్రభుత్వానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అందులో భాగంగానే తొలివిడతలో కోయంబత్తూరులో నిర్మించిన హైపర్‌ మార్కెట్‌ను బుధవారం ప్రారంభించారు.

 

తమిళనాడులో లులు గ్రూప్‌ చెన్నైలో అంతర్జాతీయ స్థాయి మాల్‌ నిర్మాణం సహా పలు ప్రాజెక్టుల్లో రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనుంది.
కాగా అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న లులు గ్రూప్‌ని గత ప్రభుత్వం ఎంతో కష్టపడి విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించింది. విశాఖలో అంతర్జాతీయస్థాయి కన్వెన్షన్‌ సెంటర్‌, షాపింగ్‌మాల్‌, ఐదు నక్షత్రాల హోటల్‌ కట్టేందుకు ఆ గ్రూప్‌ అంగీకరించింది. రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. విశాఖ సముద్రతీరంలో 13.83 ఎకరాల్ని గత ప్రభుత్వం ఆ సంస్థకు కేటాయించింది. ఆ ప్రాజెక్టు ఆచరణలోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించేది.

 

ఆ ప్రాజెక్టుని ఆచరణలోకి తెచ్చే దిశగా అన్ని ప్రయత్నాలు వేగంగా జరిగాయి. ప్రాథమిక డిజైన్లు కూడా సిద్ధమయ్యాయి. విశాఖలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఐదు వేల సీట్ల సామర్థ్యంతో కన్వెన్షన్‌ సెంటర్‌, ఎగ్జిబిషన్‌ కేంద్రాలు, తొలి దశలో 220 గదులతో ఐదు నక్షత్రాల హోటల్‌ నిర్మించాలన్నది ప్రతిపాదన. అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే లులు గ్రూప్‌కి భూకేటాయింపులు రద్దు చేసింది. ఆ సంస్థకు భూకేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ బురదజల్లే ప్రయత్నం చేసింది.

 

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -