Jagan: కాపులను దూరం చేసుకుంటున్న జగన్… తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నాడు…!

Jagan: 2019 ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలియజేశారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న కాపులు కూడా జగన్ వెంట నిలబడ్డారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చినా కూడా వాటిలో ఏది కూడా జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేదు. పైగా పదవుల్లో కూడా కాపులకు అన్యాయం చేశారు.

అయితే గత ఎన్నికల్లో జనసేన ని కాదని వైసీపీ వెంట నడిచిన కాపులు కాపు నాయకులు ఈసారి తమ సొంత పార్టీ అయిన జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో నూటికి 90% కాపులందరూ కూడా ఇప్పుడు జనసేన వైపే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తమని మోసం చేశారని ఈసారి వైసీపీకి మద్దతు తెలిపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.

 

అయితే కాపు ప్రజలతో పాటు కాపు నాయకుడు కూడా జనసేన టిడిపి వైపు చూస్తున్నారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మొన్నటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉండేవారు. అయితే పెద్దాపురం ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పి డబల్ గేమ్స్ ఆడడంతో ముద్రగడ వైసీపీలో చేరే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తాను జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.

 

ఇక ప్రముఖ క్రికెటర్ గుంటూరు కి చెందిన అంబటి రాయుడు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాడే. తాను కూడా వైసిపిలో చేరి వారం రోజులు కూడా ఉండకుండా రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిపోయారు. జగన్మోహన్ రెడ్డితో తాను నడవలేని ప్రకటించారు. ఇక కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధా కూడా గత ఎన్నికల్లో వైసీపీలో ఉండి మోసపోయి రాజీనామా చేసి టిడిపిలో చేరిపోయారు. ఇక వైసిపి వైపు చూసే ప్రసక్తే లేదని చెప్పారు.

 

ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గం ఇన్‌చార్జిల మార్పులు చేర్పుల కారణంగా వైసీపిలో ఉన్న కాపు నేతలు జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబు తదితరులు కూడా వైసీపీనీ వదిలేసి జనసేనలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. నాలుగో జాబితా ప్రకటిస్తే మరికొంతమంది వైసీపికి గుడ్ బై చెప్పేసి టిడిపి, జనసేనలలో చేరవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసిన కూడా ఏమీ చేయలేకపోతున్నారని అంటున్నారు. ఈసారి ఏం చేసినా కాపులు జగన్ ను నమ్మే ప్రసక్తి లేదని అర్థమైనట్లు గా మాట్లాడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -