Kurnool: కర్నూలు వాసులకు జగన్ సర్కార్ అన్యాయం.. ఏం జరిగిందంటే?

Kurnool: కర్నూలు ప్రజల్ని ఏపీ పిచ్చోళ్లను చేసింది అంటూ ప్రస్తుతం వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కర్నూలు వాసులకు జగన్ సర్కార్ అన్యాయం చేసిందని కర్నూల్ వాసులుఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే… కర్నూలు న్యాయ రాజధాని పేరుతో కర్నూలు ప్రజల సెంటిమెంట్లతో ఆడుకుంటున్న ఏపీ ప్రభుత్వం చివరికి వారిని మోసం చేసింది. కనీసం హైకోర్టు బెంచ్ పెట్టడానికి కూడా ఏర్పాట్లు చేయలేదు ఏపీ ప్రభుత్వం. కర్నూల్ లో జగన్నాథ గట్టు మీద హైకోర్టు పెడతామని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

అలా ప్రచారం చేసి రియల్ ఎస్టేట్ స్కామ్ లకు పాల్పడ్డారు. అక్కడ పెట్టాలనుకున్న పెట్టిన కార్యాలయాలేమీ లేవు. పేరుకు మొదట కర్నూలుకు తరలిస్తారు. తర్వాత గుట్టు చప్పుడు కాకుండా అమరావతిలో ఏర్పాటు చేస్తారు. కర్నూలులో ఏర్పాటు చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత రాత్రికి రాత్రే అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యాలయాలు ఎన్నో ఉన్నాయి అంటూ కర్నూలు వాసులు మండిపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ఎపిఇఆర్‌సి ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మార్చిన సంగతి తెలిసిందే.

 

ఈ మేరకు తాజాగా విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కానీ దానిని ఏ ప్రాతిపదికిన కర్నూల్ లో పెట్టారన్న అంశాన్ని మాత్రం వెల్లడించలేదు. ఒక వేళ తాము రాజధాని అని చెబుతున్న విశాఖలో అయినా పెట్టారా అంటే అది కూడా లేదు. అసలు ఏపీఈఆర్సీ కి కర్నూలుకు సంబంధం ఏమిటో కూడా స్పష్టత లేదు. కాగా ఈ అంశంపై ఎవరో ఒకరు కోర్టుకు వెళతారు. కోర్టు తరలింపు నిలిపివేస్తుంది. ఒక వేళ ఏపీఈఆర్సీ కార్యాలయాన్ని కర్నూలులోనే ఉన్నా ప్రజలకు ఉపయోగం ఏమిటీ అన్నది ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది. ఏపీఈఆర్సీ చైర్మన్ ఎప్పుడూ కార్యాలయం ఉండరు. ఒక పది మంది ఉద్యోగులు వస్తారేమో కానీ.. కర్నూలులో పెడితే వారూ వస్తారో వర్క్ ఫ్రం హైదరాబాద్ అంటారో చెప్పడం కష్టం.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -