YS Jagan: జగన్ మెప్పు కోసం ఈసీ గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తున్న అధికారులు.. కొరివితో తల గోక్కుంటున్నారంటూ?

YS Jagan: ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అధికారులు వైసీపీ నేతలు అడుగుజాడల్లో నడుస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్ పై స్వామి భక్తి చాటుకుంటున్నారు. అధికారుల వ్యవహారం చూస్తూ ఏపీలో ఈసీ నిబంధలను అమలు అవుతున్నాయా? లేవా? అనే అనుమానం కలుగుతోంది. ఎన్నికల కోడ్ ప్రతిపక్షనేతలకే తప్పా.. అధికారపక్షానికి వర్తించదనే విధంగా మారింది.

ఏపీలో భూములు సర్వే జరుగుతోంది. ఫేజ్ 2, ఫేజ్ 3 జరిగినా సంబంధిత ఎల్పీఎంలు, పాసు పుస్తకాలను ఇప్పుడు ముద్రిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక సీఎం ఫోటోను, ప్రభుత్వ సంబంధిత ఫోటోలను ముద్రించ కూడదు. కానీ, సర్వే పూర్తి అయిన రైతులకు ఇస్తున్న పత్రాలపై జగన్, ఆయన తండ్రి వైఎస్సార్ తో పాటు.. నవరత్నాల ఫోటోను సైతం ముద్రిస్తున్నారు. జగన్ ఫోటోను మొదటి పేజీలోనే కాకుండా అన్ని పేజీలపైనా ముద్రిస్తున్నారు. అన్ని డాక్యూమెంట్లపైనా జగన్ ఫోటోలు పెట్టాల్సిందేనని జాయింట్ కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎన్నికల నిబంధలను ఉల్లంఘించి జగన్ ఫోటోలు వేస్తే.. తమ పరిస్థితి ఏం కావాలని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పాస్ పుస్తకాల ముద్రణ విషయంలో జాయింట్ కలెక్టర్ల పరిస్థితి ముందు నుయ్యి, వెనక్కి చూస్తే గొయ్యి అనేలా తయారైంది.

షెడ్యూల్ విడుదలైనపుడే ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండొద్దని స్పష్టం చేసింది. షెడ్యూల్ విడదలైనప్పటి నుంచి పాలనా పరంగా ఏం జరిగినా అధికార పార్టీకి సంబంధం ఉండదని తేల్చి చెప్పింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. కానీ, అధికారులు మాత్రం మనకు కాదులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కానీ, వేటు పడితే.. వైసీపీ నేతల కూడా కాపాడలేరనే విషయాన్ని అధికారులు అర్థం చేసుకోలేకపోతున్నారు.

అధికారులు ఈ ఒక్క విషయంలోనే కాదు.. అడుగడుగునా వైసీపీకి అనుకూల వైఖరి తీసుకుంటున్నారు. పలు చోట్ల అధికారులపై వేటు పడినా తీరు మారడం లేదు. చిన్న కార్యక్రమాల్లో పక్కన పెడితే.. ఇటీవల ప్రధాని మోడీ హాజరైన చిలకలూరి పేట సభలో కడా పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అందరం చూశాం. ప్రజలు ఎక్కడ కూర్చున్నారో. వీఐపీలు ఎక్కడ ఉన్నారో తెలియకుండా ప్రధానికి కూడా సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు కలిగేలా చేశారు. దీనిపై చివరికి కేంద్రమే విచారణకు ఆదేశించే వరకూ తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా సీఎస్ జవహార్ రెడ్డి ఎన్నికలపై సమీక్షలు చేస్తున్నారు. ఆయన ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో వైసీపీ నేతల అండతో అధికారులు రెచ్చిపోతున్నారు. ఎన్నికల నిబంధనల పేరుతో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. పబ్లిక్ ప్రాంతాల్లో వైసీపీకి చెందిన బ్యానర్లు ఉన్నా.. పట్టించుకోని అధికారులు.. టీడీపీ నేతల ఇళ్ల దగ్గర వారి బ్యానర్లు ఉంటే తొలగిస్తున్నారు. సీఈఓ మీనా ఆదేశాలను పక్కన పెట్టి.. తమకు అనుకూలంగా ఉన్నవారి కోసం పని చేస్తున్నారు. సీఈఓ ఆదేశించినా.. ఓ కలెక్టర్ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను తొలగించలేదు. దీనిపై సీఈఓ ప్రశ్నిస్తే.. కింది అధికారులకు చెప్పా.. వారు తొలగించలేదని కలెక్టర్ సమాధానం చెప్పారట. ఇది ఏపీలో వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు తీరు. రాష్ట్ర స్థాయి అధికారి అయిన సీఈఓ పరిస్థితే ఇలా ఉంటే.. మరి రాష్ట్రవ్యప్తంగా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -