Students Suspended: నినాదాలు చేస్తే సస్పెండ్.. ఏపీ రాజకీయాలలో ఇంత దారుణమైన పరిస్థితి ఉందా?

Students Suspended: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ బస్సు యాత్రలో భాగంగా ఇటీవల జగన్ మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం వద్ద ఏడీబీ రోడ్డులోని ఆదిత్య వర్సిటీ మీదుగా జగన్ బస్సు యాత్ర కొనసాగింది అయితే జగన్మోహన్ రెడ్డి దృష్టిని ఆకర్షించడం కోసం వర్సిటీ యాజమాన్యం థాంక్యూ సీఎం సార్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అక్కడ విద్యార్థులను నిలబెట్టారు.

ఈ విధంగా ఆ ఫ్లెక్సీలను చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి బస్సు ఆపి మరీ అక్కడ విద్యార్థులతో మాట్లాడారు విద్యా దీవెన,వసతి దీవెన వస్తున్నాయా అంటూ అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కొంతమంది అబ్బాయిలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపారు జగన్మోహన్ రెడ్డి అక్కడ వర్సిటీ యాజమాన్యంతో మాట్లాడుతూ ఉండగా కొంతమంది అబ్బాయిలు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేశారు.

ఈ విధంగా కాలేజీ కుర్రాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నినాదాలు చేయడంతో ఆదిత్య కాలేజ్ ఆ విద్యార్థుల పట్ల కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎవరైతే అక్కడ జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడారో వారందరినీ సస్పెండ్ చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. సీఎం దృష్టిని ఆకర్షించడం కోసం యాజమాన్యం పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది కానీ విద్యార్థుల వల్ల ఆ ప్లాన్ మొత్తం చెడిపోయిందన్న కారణంతోనే వారందరిని సస్పెండ్ చేసినట్లు సర్క్యులర్ జారీ చేశారు.

ఇక ఈ విషయంపై కొందరు స్పందిస్తూ వారు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ వ్యతిరేకంగా ప్రవర్తించలేదు కేవలం కళ్యాణ్ బాబుకి మాత్రమే మద్దతుగా నిలచారు అంతమాత్రానికి వీరిని సస్పెండ్ చేస్తారా ఇదెక్కడి దారుణం అంటూ కామెంట్లో చేస్తున్నారు మరి ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -