Jaggery Tea: టీలో బెల్లం కలిపి తాగితే ఈ ప్రయోజనాలు ఉంటాయి..

Jaggery Tea: మనం బంధువుల ఇంటికెళ్లినా.. వారు మన ఇంటికి వచ్చిన మొట్టమొదటిగా అడిగేది టీ తాగుదామా.. సాధారణంగా ఇద్దరు స్నేహితులు కలిసినా టీతాగుతూనే మాట్లాడుకుంటారు. అస్సలు టీ తాగని వారే ఉండరు. అయితే కొంతమంది ఒక్కసారి తాగితే వారికి తాగినట్లు అనిపించదు. రోజుకు 5 సార్ల కన్నా ఎక్కువగానే తాగుతుంటారు. అయితే టీ తాగిన ప్రతిసారి అందులో ఉండే చక్కెర మన శరీరంలోకి వెళ్లి క్యాలరీలను పెంచడంతో బరువు కూడా అధికంగా పెరుగుతాం. అలాగే, చక్కెర తయారీకి వాడే రసాయనాల కారణంగా మనం వివిధ వ్యాధుల బారి న పడే అవకశాలు కూడా ఉన్నాయి. అయితే, టీలో చక్కెరకు బదులుగా బెల్లంను చేర్చుకుంటే ఈ ముప్పుల నుంచి తప్పించుకోవచ్చు. దీంతో పాటు బెల్లంతో ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా ఉంటాయి.

బెల్లంలో 40–60 శాతం సుక్రోజ్, 30–40 శాతం నీరు, 20–25 శాతం ఇన్వర్టెడ్‌ షుగర్‌ ఉంటుంది. 100 గ్రాముల బెల్లంలో 358 కెలరీలు, 27 మిల్లీ గ్రాముల సోడియం, 53 మిల్లీ గ్రాముల పొటాషియం, 0.22 శాతం క్యాల్షియం, 32 శాతం ఐరన్, 85 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయి. అందుకే బెల్లంను ’లిక్విడ్‌ గోల్డ్‌’ అని పిలుస్తుంటారు. బెల్లంలోని యాంటీ అలర్జిక్, బాడీ టెంపరేచర్‌ రెగ్యులేఇంగ్‌ లక్షణాలు ఆస్తమా, బ్రాంకైటిస్‌ నివారణకు చాలా చక్కగా ఉపయోగపడతాయి.

జీర్ణక్రియలో ఎంజైమ్ల విడుదలలో బెల్లం చురుకైన పాత్ర పోషించి రక్తహీనత, అజీర్తి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అందుకే బెల్లంతో చేసిన చాయ్‌ తాగడం అలవాటు చేసుకోవాలి. మలబద్దకంతో బాధపడేవారికి బెల్లంతో చేసిన టీ తాగడం వలన ఎంతో మేలు చేస్తుంది. టీలో బెల్లంను చేర్చడం వల్ల జీర్ణ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. జీర్ణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. బెల్లం బ్లడ్‌ ఫ్యూరిఫయర్లా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా పెరుగుతుంది. శరీరంలో హిమగ్లోబిన్‌ పరిణామాన్ని కూడా పెంచుతుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కూడా బెల్లంతో తయారు చేసిన టీని ఉదయం వేళ తాగితే సత్ఫాలితాలు ఇస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -