Jailer Review: జైలర్ మూవీ రివ్యూ!

Jailer Review: రజనీకాంత్ హీరోగా తమన్నా హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. రజనీకాంత్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో పాటు డార్క్ కామెడీ కూడా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. జైలర్ తన ఫ్యామిలీ కోసం మాఫియాపై యుద్ధం మొదలుపెడితే ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

రజనీకాంత్ ఈ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2.0 సినిమా తర్వాత రజనీకాంత్ కెరీర్ లో ఆ స్థాయి హిట్ ఏదనే ప్రశ్నకు ఈ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ నటన, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్, కథ, కథనం ఈ సినిమాకు ప్లస్ కాగా ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.

 

రజనీకాంత్ అభిమానులకు ఫుల్ మీల్స్ అనేలా ఈ సినిమా ఉండటం గమనార్హం. ఏడు పదుల వయస్సులో కూడా రజనీకాంత్ అదిరిపోయేలా నటించి తన నటనతో మెప్పించారు. ఫస్టాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ అద్భుతంగా ఉంది. ఫస్టాఫ్ లోని కొన్ని సీన్లు మాత్రం స్లోగా సాగుతాయి. రజనీకాంత్ అభిమానులతో పాటు సాధారణ అభిమానులకు సైతం ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

హాలీవుడ్ మూవీ నోబడీని పోలిన సన్నివేశాలు జైలర్ సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. అయితే కాపీ ఆరోపణల గురించి మేకర్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. జైలర్ సక్సెస్ తో రజనీకాంత్ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -