Janasena: ఆ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీ.. బాబు ఒప్పుకుంటారా?

Janasena: ప్రస్తుతం ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి అప్పుడే వేడి మొదలైంది. ఏపీలో రాజకీయాలు మొన్నటి వరకు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టుగా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవలే వారాహి యాత్ర మొదలు పెట్టి నప్పటి నుంచి రాజకీయాలు మరింత వేడిగా మారాయి. ఏపీలో టీడీపీ జనసేన పొత్తు విషయం గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు ఊహాగానాలు వినిపించిన తెలిసిందే. టీడీపీ తో జనసేన పొత్తు పెట్టుకుంటే జనకే జనసేనకు ఇవ్వాల్సిన సీట్లు ఇచ్చేయాల్సిందే.

విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గం సీటుని జనసేన కోరుతోంది అన్న ప్రచారం అయితే ఉంది. ఈ సీటు టీడీపీకి చాలా ఇంపార్టెంట్. 1983 నుంచి 2004 వరకూ వరసగా గెలుచుకుని వచ్చిన సీటు. అయితే గడచిన రెండు దశాబ్దాలలో 2014లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఓడిన కూడా లక్ష ఓట్లకు తగ్గకుండా 2019లో టీడీపీ సాధించింది. టీడీపీకి బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సీటు ఇది. అలాంటి సీటుని ఇపుడు జనసేన కోరుతోందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సీటు నుంచి 2019లో జనసేన తరఫున పోటీ చేసి పాతిక వేలు ఓట్లు తెచ్చుకున్న పంచకర్ల సందీప్ పోటీ చేస్తారు అని అంటున్నారు.

 

ఆయన రాజకీయాలకు కొత్త జనసేన కొత్త అయినా సరే పాతిక వేల ఓట్లను ఆనాడే తెచ్చారు. ఈసారి అంతకంటే ఎక్కువ ఓట్లతో విజయం ఖాయమని జనసేన భావిస్తోంది.పొత్తులు కనుక ఉంటే బంపర్ మెజారిటీ ఖాయమని కూడా లెక్క వేసుకుంటోంది. ఇక్కడ నుంచి టీడీపీ నుంచి చాలా మంది పోటీకి రెడీ అవుతున్నా జనసేన సీటు కోరితే ఇచ్చేయడం ఖాయమని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -