Pawan Kalyan: ఏపీలో అధికార మార్పు జరిగే ముందు రక్తపాతమట.. ఆయన కామెంట్లు నిజమవుతాయా?

Pawan Kalyan: ఎన్నికల వేళ ఏపీలోని పరిస్థితులు చూస్తే ఆందోళన కరంగా మారుతున్నాయి. ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉంది. కానీ.. పోలింగ్ ఇవాళ, రేపు అన్నంతగా వాతావరణం మారిపోయింది. ప్రతీ రోజూ ఏదో ఒక చోట గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. రానురాను మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన కొన్ని పరిస్థితులు గమనిస్తే దాడులు ఖాయమనే భావన కలుగుతోంది. రీసెంట్ గా జనసేన అధినేత పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కలిసేవారిలో కొన్ని కిరాయి మూకలు ఉన్నాయని ఆయన అన్నారు. సన్న బ్లేడ్లతో తనను, తన సెక్యూరిటీ వాళ్లనూ కట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్కడితో ఆగకుండా ప్రత్యర్థి పార్టీ చరిత్ర, ఆ పార్టీ పన్నాగాలు ఎలాగూ తెలుసు కనుక జనసేన నేతలు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వవన్ కామెంట్స్ కాసేపు పక్కన పెడితే కేంద్రం నారా లోకేష్‌కు సడెన్‌గా ఇటీవల సెక్యూరిటీ పెంచింది. ఇంటెలిజెన్సీ సిఫారులతో ఆయన భద్రత పెంచింది. ప్రస్తుతం పెరిగిన భద్రతా సిబ్బంది ఆయన రక్షణగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ బలగాలు ఆయనకు సెక్యూరిటీగా ఉండనున్నారు. అందులో భాగంగా 33 మంది సెక్యూరిటీ సిబ్బంది నారాలోకేష్ ఇంటికి వెళ్లారు. అప్పటి నుంచి విధుల్లో చేరారు. వైసీపీ ప్రేరేపిత దాడులు లోకేష్ పై జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఇంటెలిజెన్సీ కేంద్రానికి రిపోర్టులు ఇచ్చింది. దీంతో.. అప్రమత్తమైన కేంద్రం ఆయన భద్రతను పెంచింది. ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో చేరారు. ఇటీవల ఎక్కడిక్కడ నారాలోకేష్ వాహనాలను చెక్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో చెక్ చేయడంలో తప్పులేదు. ఒకే రోజు గంట వ్యవధిలోనే రెండు, మూడు చోట్ల తనిఖీలు జరగడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో.. టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు లోకేష్ కు సెక్యూరిటీ పెంచడానికి కారణమని చెప్పొచ్చు.

ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతీరోజూ చిన్నాచితకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు.. రాజకీయాలకు సంబంధం లేదని చాలా విషయాలను రాజకీయాలతో ముడిపెట్టి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఇటీవల తెనాలికి చెందిన గీతాంజలి అనే వివాహిత మరణం చుట్టే కొన్ని రోజుల పాటు ఏపీ రాజకీయాలు తిరిగాయి. ఆమె చావుకు కారణం మీరంటే మీరే అంటూ వైసీపీ-టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. ఇలా ఏ విషయం ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికల్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై పోలింగ్ బూత్‌లోనే దాడి జరిగింది. ఆయన అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా వందలమంది వైసీపీ మద్దతుదారులు వెంటాడి దాడి చేశారు. ఈ పరిస్థితులను గమనిస్తే ఏపీలో ఎన్నికల సమయంలో దాడులకు ఆస్కారం ఉందని అర్థం అవుతుంది.

అయితే అది ఈసారి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో దాడులు ఏ స్థాయిలో జరిగాయో.. అందరూ చూశారు. ప్రలోభాలు, బెదిరింపులతో మెజార్టీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. పోటీ తప్పదనుకున్న చోట పోలింగ్ రోజున దాడులు జరిగాయి. బోండా ఉమా, బుద్దావెంకన్నపై హత్యాయత్నం కూడా జరిగింది. కాబట్టి దాడులు, గొడవలు ఉంటాయని క్లియర్ గా అర్థం అవుతుంది. కానీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవి ఎంత పెద్ద ఎత్తున ఉంటాయోఅని ఆందోళన కలుగుతోంది. పవన్ కామెంట్స్ ఇప్పుడు సంచనలంగా మారాయి. పవన్ ఓ రాజకీయ నాయకుడిగా అధికార పార్టీపై విమర్శలు చేస్తారు. వాటిని కేవలం ఆధారాలు లేని విమర్శల కొట్టిపారేసినా.. రాజకీయాలతో సంబంధం లేదని వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకు నరేష్ ఇలాంటి కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికల్లో రక్తపాతం తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంటే పార్టీలు గెలవడం కోసం ఎంతకైనా తెగిస్తాయని అర్థం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -